జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు  వ్యతిరేకంగా అవసరమైతే తమ రెండు పార్టీలు రోడ్లమీదకు వచ్చి పోరాటాలు చేయటానికి కూడా రెడీగా ఉన్నట్లు బిజెపి, జనసేన పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. అంటే వీళ్ళు చెప్పేదంతా  రాజధాని తరలింపు అంశం మీదే కేంద్రీకృతమయ్యుంది లేండి. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించేటపుడు చంద్రబాబునాయుడు అన్నీ రాజకీయపార్టీల ఆమోదంతోనే చేసినట్లు  పచ్చి అబద్ధాలు చెప్పారు.

 

నిజానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అప్పట్లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి బిజెపి ఆమోదం కూడా ఉందనే అనుకోవాలి. బిజెపిని పక్కన పెట్టేస్తే రాజధాని విషయంపై  చంద్రబాబు ఇంకే పార్టీతోను మాట్లాడలేదు. కనీసం అఖిలపక్షం ఏర్పాటు చేసి తన మనసులోని మాటను కూడా చెప్పలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపితో కూడా మాట మాత్రం కూడా చెప్పలేదు.  ఎవరో తనకు కావాల్సిన  కొద్దిమందితో చంద్రబాబు  మాట్లాడేసుకుని  అసెంబ్లీలో ఏకపక్షంగా రాజధానిపై ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

అంటే అప్పట్లో తనకు అధికారం ఉందన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు తనిష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో తనకున్న బంపర్ మెజారిటి దన్నుతో అదే విధంగా చేసుకుపోతున్నట్లే అనిపిస్తోంది. దీన్నే కన్నా, పవన్ భరించలేకపోతున్నారు.  చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తే నోరెత్తని పార్టీలు ఇపుడు జగన్ విషయంలో మాత్రం అఖిలపక్షమంటు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

మొత్తానికి జగన్ కు వ్యతిరేకంగా పోటి చేయాలని ఏకమైన బిజెపి, జనసేన పార్టీల నేతలు ఆత్మవంచన చేసుకుంటున్నట్లు స్పష్టమైపోతోంది. పైగా తమ రెండు పార్టీలను కాదని జగన్ రాజధానిని తరలించుకుని వెళ్ళే ప్రసక్తే లేదని బెదిరిస్తుండటం విచిత్రంగా ఉంది. ఏడు నెలల జగన్ పాలనపై జనాలందరూ వ్యతిరేకమైపోయారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. చూద్దాం రెండు పార్టీలు జగన్ కు వ్యతిరేకంగా ఎంతమాత్రం బలంగా పోరాటం చేస్తాయో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: