జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజదాని  రగడ  రగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన చేయడం... రాజధాని అధ్యయనం కోసం నియమించిన  రెండు కమిటీలు జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో... ఇప్పుడు పార్టీలన్ని జగన్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తొలగించే ప్రసక్తే లేదంటూ నిరసనలు ఆందోళనను కూడా ఆందోళనలు  చేపడుతున్నాయి. విపక్ష పార్టీలైనా టిడిపి బిజెపి జనసేన పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 ఇక రాజధాని అమరావతి లో కూడా రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. రైతులు రైతు కుటుంబం మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో  అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో నిరసన తెలుపుతున్న  రైతులందరికీ ధైర్యం చెబుతూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు బిజెపి జనసేన  సమావేశం అనంతరం.. బిజెపి జనసేన కలిసి ఒకటిగా నడవాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటిసారి రాజధాని అమరావతి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. 

 

 

 

 అమరావతి నుంచి రాజధాని తరలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... అది వాస్తవంగా సాధ్యం కాదని తెలిపారు. అమరావతి నుంచి రాజధాని తరలించాలని చూస్తే తాము రోడ్డు మీదకు వస్తామని.. మెజారిటీ ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతికి ఆమోదం తెలిపి  భూసేకరణ భూ సమీకరణకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని... పవన్ కళ్యాణ్  ఆరోపించారు. మూడు రాజధానుల  అంశాన్ని తెరమీదికి తెచ్చి రాష్ట్ర ప్రజలందరిని  జగన్ సర్కార్  మభ్యపెడుతున్నారని పవన్ కళ్యాణ్  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: