ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మొత్తం అమరావతి ప్రాంతం చుట్టూ తిరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో నుండి తొలగించి చేస్తున్నారని రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వైయస్ జగన్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ప్రజలను రెచ్చగొడుతూ ఉద్యమాలు మరియు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు వైయస్ జగన్ కి సవాల్ చేస్తూ అమరావతి మరియు మూడు రాజధానులను రెఫరెండం గా తీసుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని అప్పుడు వైయస్ జగన్ గెలిస్తే కచ్చితంగా శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ చంద్రబాబు ఇటీవల కామెంట్లు చేయటం మనకందరికీ తెలిసినదే.

 

ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తరుణంలో కొందరు అంటే ఆయనకు కుడిభుజంగా ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తాజాగా ఆయన నియోజకవర్గం పాలకొల్లులో ప్రజా బ్యాలెట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. అమరావతి, మూడు రాజధానులు అంశంపై జరగబోతున్న ఈ ప్రజా బ్యాలెట్ గురించి రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా చెప్పాలంటే ప్రజా బ్యాలెట్ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు లాంటిదే అని ఎన్నికలకు వెళ్లకుండా ప్రతి ప్రాంతంలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజాభిప్రాయసేకరణ తీసుకొని రాజధాని విషయంలో అధికార పార్టీ సరైన అడుగులు వేస్తే బాగుంటుందని భవిష్యత్ తరాలకు మంచి చేసినట్టు అవుతుందని అంటున్నారు రాజకీయ విశేషాలు.

 

ప్రస్తుతం అయితే అమరావతి రాజధాని ఈ విషయంలో కేవలం చంద్రబాబు మరి ఆ ప్రాంతంలో ఉన్న వారు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉండగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: