సినిమాలపరంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. అసంఖ్యాకమైన అభిమానుల బలంతో పవన్ స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే.. రాజకీయాల్లో మాత్రం పవన్ కు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రజలు ఓట్లేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కు బిత్తరపోయేట్టు చేశారు. ఎన్నికల్లో party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, బీఎస్సీతో పొత్తు పెట్టుకుని వెళితే కనీసం పవన్ ను కూడా గెలిపించ లేదు. అప్పటికి కానీ వాస్తవ పరిస్థితులు తెలీలేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్.

 

 

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా బలం అతని ఫ్యాన్స్ వల్లే. ఎంతోమంది యువతకు ఐకాన్ గా రాజకీయాల్లో కూడా క్రేజ్ సంపాదించాడు. కానీ రాజకీయంగా ఆయన నిర్ణయాలను ఎప్పటికప్పుడు స్వాగతించిన అభిమానులు మళ్లీ బీజేపీతో పొత్తు అంటే ఎలా తీసుకుంటారో తెలీని పరిస్థితి. పార్టీ పెట్టిన ఆరేళ్లలో కాంగ్రెస్, వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తులు నెరిపిన పవన్ తాజాగా బీజేపీతో జత కట్టాడం చర్చనీయాంశం అవుతోంది. ఓదశలో పార్టీని విలీనం చేసేస్తాడని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. కానీ.. విజయవాడలో బీజేపీతో కలిసి చర్చలు జరిపి ఆ పార్టీతో దీర్ఘకాలిక పొత్తు అని ప్రకటించి వారితో చేతులు కలిపాడు.

 

 

గతంలో బీజేపీతో కలిసి నడిచి.. తర్వాత విమర్శించి.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టాడు. ఇదంతా పరిశీలిస్తున్న రాజకీయవాదులకు మాత్రం జనసేన – బీజేపీల పొత్తు కొనసాగుతుందా అని ఆలోచన చేస్తున్నారు. జాతీయ పార్టీ కావడంతో వాళ్ల నిర్ణయానికి అనుగుణంగానే వెళ్లాలి కానీ పవన్ సొంత నిర్ణయాలకు తావుండదు. పవన్ ఏం చేసినా బీజేపీ గమనిస్తూ కంట్రోల్ లో పెట్టడానికి చూస్తుంది. దీనిని పవన్ అంగీకరిస్తారా లేదా అనేది భవిష్యత్తే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: