ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని రాబోయే 2024 ఎన్నికలకు రెడీ అవ్వాలి అని ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బెజవాడలో హోటల్ లో సమావేశం కావడం జరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అయితే భారతీయ జనతా పార్టీ అంటే చాలా వరకు దేశంలో ఉన్న ప్రజలకు అది ఒక మతతత్వ పార్టీ అని దాని భావజాలాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ఉంటాయని మరి ఇటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇద్దరు కలిసి అడుగులు వేయటం అసాధ్యమని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని గట్టిగా నమ్మేవాడు కానీ బీజేపీ భావజాలం దానికి విరుద్ధంగా ఉంటుంది అని ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కేంద్రంలో దేశవ్యాప్తంగా మార్పు రావాలని తీసుకోబోయే నిర్ణయాలలో ఏమాత్రం బిజెపి పార్టీకి వ్యతిరేకంగా దేశంలో గాని రాష్ట్రంలో గానీ వ్యతిరేకత వస్తే కచ్చితంగా అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ బిజెపితో తెగదెంపులు కటింగ్ చేసుకోవడం గ్యారెంటీ అనే టాక్ ఇప్పటి నుండే మొదలైంది.

 

ఇప్పటికే బీజేపీ పార్టీలో అంతర్గతంగా దేశంలోని హిందువుల తప్ప వేరే మతస్తులు ఉండకూడదన్న వాదన బలంగా వినబడుతున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు భవిష్యత్తు రాజకీయాలలో బిజెపి కేంద్రంలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి విషయాల్లో కొత్త చట్టాన్ని తీసుకువస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని నమ్మే పవన్ కళ్యాణ్...ఖచ్చితంగా భవిష్యత్తులో బిజెపి పార్టీ తో కలవడం అనేదే ఉండదు అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: