పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు తమకు అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు తాజాగా బిజెపి పార్టీ తో పవన్ కళ్యాణ్ ని కలవడం పట్ల కామెంట్లు చేస్తున్నారు. అత్యధికంగా పవన్ కళ్యాణ్ ని సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని అభిమానించిన వర్గాలలో ఎక్కువగా కనబడేది దళితులు మరియు ముస్లింలు ఇటువంటి నేపథ్యంలో అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్.. బిజెపి పార్టీతో చేతులు కలిపి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవ్వాలని వేసిన పొలిటికల్ స్టెప్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలలో ఓడిపోయి రెండు చోట్ల ఆ తర్వాత ఎన్నికల లో పాల్గొన్న ఓటర్లు గుడి మెట్ల దగ్గర బిక్షం ఎత్తుకునే వాళ్ళ తో పోల్చిన పవన్...తరువాత తాను ఓడిపోవడానికి కారణం తన అభిమానులు మరియు కార్యకర్తలు అని కామెంట్లు చేసి అప్పట్లో జనసేన పార్టీ కార్యకర్తలను తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది.

 

ఆ సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులు...ఏ టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరికీ తెలియని సందర్భంలో రాజకీయంలో కొమ్ము కాసి భుజం కాస్తే మాపై ఎలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ అప్పట్లోనే పవన్ పై సీరియస్ అయిన అభిమానులు తాజాగా ఎవరితో పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా బిజెపి పార్టీ తో జనసేన పార్టీ కలవడం పట్ల తీవ్ర స్థాయిలో విభేదిస్తున్నారు. గతంలో ఢిల్లీ గులాంగిరి కి ఒంగునే పార్టీ మెడ దించే పార్టీ జనసేన పార్టీ కాదు ఢిల్లీ అహంకారాన్ని అణచివేస్తమంటూ..ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ పెద్దల దగ్గర తమ మనోభావాలను అభిమానాన్ని పవన్ కళ్యాణ్ ఈ విధంగా తాకట్టు పెట్టడం మాకు నచ్చడం లేదని అనవసరంగా సినిమా యాక్టర్ లను నమ్మి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వాళ్ళం అవుతున్నట్లు సోషల్ మీడియాలో లోలోపల ఫీల్ అయిపోతున్నారు జనసేన పార్టీ సైనికులు.

 

మరోపక్క రాజకీయాలు చేత కానప్పుడు చేత కాకుండా ఉండాలి ఇలాంటి రాజకీయాలు చేయటం చాలా దారుణం ముందు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఇప్పుడే బిజెపి సిద్ధాంతాలు అంటూ మాట్లాడటం చాలా దారుణం అని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు విభేదిస్తున్నారు. బీజేపీ ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ కి పార్టీలో ఉన్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా ఉండాలని రాబోయే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మధ్య గొడవలు సృష్టించే వాతావరణం వచ్చిన రావొచ్చని ఈ క్రమంలో మతం పేరిట ఎంత అలజడి అయిన సృష్టించే వారితో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల మనకే నష్టం వాటిల్లుతుందని చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని వదిలేయడానికి సిద్ధమవుతున్న ట్లు సమాచారం.

 

ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ కి రాజకీయం లో అతిపెద్ద వెన్నుపోటు జనసేన పార్టీ కార్యకర్తలు చేసినట్లవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే కింద క్యాడర్ కూడా ఈ విధంగా ప్రవర్తించడం లో తప్పు లేదని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: