రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు తెలంగాణలో నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ అడుగడుగునా ప్రజలు నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎన్ని ఎన్నికలు జరిగినప్పటికీ... కాంగ్రెస్ మాత్రం సత్తా చాటి లేకపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అసలు పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా అనే విధంగా తయారయింది. ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో  పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన కానీ ఎక్కడ వినిపించడం లేదు. 

 

 

 దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ప్రజలు అనుకుంటున్న మాట. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అని చాలామందికి ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినప్పటికీ ఏ  ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రకటన కానీ కాంగ్రెస్ నేతల విషయం కానీ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఒక్కరు కూడా తెర మీదికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. కనీసం ఎన్నికల్లో కూడా ఒక స్థానంలో నిలవ  లేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో... పార్టీ కొత్త జవసత్వాలు అందించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే గత కొంత కాలం క్రితం ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన సీనియర్ నేత రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పిసిసి పదవికి రాజీనామా చేయడంతో...  ఇన్ని రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అధ్యక్షుడు లేకుండానే కొనసాగింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మరోసారి తెర మీదకు తెచ్చేందుకు బలపరిచేందుకు... నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ  కొత్త అధ్యక్షుడిగా సాకే శైలజనాథ్ నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసిరెడ్డి,  షేక్ మస్తాన్ వలిలను  నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: