తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం సంసిద్ధం అయిపోయాయి. ఇక అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపి భారీ విజయం సాధించాలని ఉవ్విళ్ళురుతున్నాయి. దీంతో తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక టిఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలను  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఓడిపోయిన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తూనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు టీఆర్ఎస్ మంత్రులు. 

 

 

 ఎత్తులు పై ఎత్తులతో టిఆర్ఎస్ లో ముఖ్య నేతలందరూ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే  మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి తనకు తాను ఇబ్బందుల్లో పడిపోవడమే కాకుండా అధికార పార్టీపై ఆరోపణలు వచ్చే విధంగా మల్లారెడ్డి వివాదం చెలరేగుతోంది. టికెట్ల కేటాయింపు విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే మేడ్చల్ జిల్లా ఫిర్దాజి గూడాలో  దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి టిఆర్ఎస్ పార్టీ టికెట్టు కేటాయించ లేకపోయింది. అయితే టిఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో మరొక రకంగా న్యాయం చేస్తాం అంటూ గులాబీ దళపతి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఇక  దయాకర్ రెడ్డి కి ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఫారం తీసుకొని నేరుగా దయాకర్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు అందజేశారు.

 

 

 ఇక టిఆర్ఎస్ నేత దయాకర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి తనను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ ను  ఓడిస్తానని ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం అధిష్టానం వరకు వెళ్లడంతో పార్టీ పెద్దలు మంత్రి మల్లారెడ్డికి  క్లాస్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రెడ్డి ని టిఆర్ఎస్ తోనే కొనసాగించే విధంగా మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రయత్నం సఫలం అయింది. అయితే తాజాగా టిఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన నేతల  విషయంలో మంత్రి మల్లారెడ్డి బుక్కయ్యారు అని ప్రచారం జోరందుకుంది. టిఆర్ఎస్ నేత రాపోలు రాములు మంత్రి  మల్లారెడ్డి మధ్య వివాదం చెలరేగినట్లు  సమాచారం. ఈ మేరకు ఫోన్ సంభాషణ వైరల్ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నట్లు  తెలుస్తోంది. తన మనిషి రమేష్ కి ఎందుకు టికెట్ ఇవ్వలేదని  మంత్రి మల్లారెడ్డి ని రాపోలు రాములు నిలదీసినట్లు సమాచారం.. టికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన తాలూకు ఫోన్ కాల్ రికార్డు తన దగ్గర ఉన్నాయని అధిష్టానానికి సమర్పిస్తాను అంటూ బెదిరించినట్లు సమాచారం. దీంతో మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: