తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే,  దీంతో ఒక్కసారిగా రాజకీయాలని వేడెక్కాయి.. ఇక అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపి భారీ విజయం సాధించాలని ఉవ్విళ్ళురుతున్నాయి. దీంతో తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక టిఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలను  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఓడిపోయిన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిస్తూనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు టీఆర్ఎస్ మంత్రులు. 

 

 

 అయితే ప్రస్తుతం ఓ  మంత్రి  అంశం తెలంగాణ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. టికెట్ కేటాయించి అభ్యర్థుల నుంచి ఆ మంత్రి  భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది. ఇక తాజాగా ఓ ఫోన్ కాల్ కూడా తెరమీదకు రావడంతో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చినట్లయింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ మంత్రి అంశం తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. మంత్రి నక్క తోక తొక్కి రాజకీయాలకు వచ్చి  అనూహ్యంగా ఓ పార్టీ నుంచి విజయం సాధించి మరో పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఏకంగా  మంత్రిగా మారి  చక్రం తిప్పుతున్నారు. గ్రేటర్ నగర శివార్లలోని ఆయన స్థానం. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయి ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టాక ఆయన తీరులో  పూర్తిగా మార్పు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

 తెలంగాణ రాజకీయాల్లోనే ఆ మంత్రి ఒక పెద్ద అనకొండ గా మారిపోయారని సొంత పార్టీ వారే  చర్చించుకుంటున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించే పరిస్థితిలో లేరని... అయినప్పటికీ కూడా ఆ మంత్రి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుంది అంటూ అంటూ టాక్ కూడా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఎవ్వరిని లెక్క చేయకుండా పార్టీ ఎదుగుదల కోసం కష్ట పడిన వాళ్ళను పక్కన పెట్టి మరి మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో టిఆర్ఎస్ లో ఈ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: