క‌ర్ణాట‌క సీఎం బీఎస్ ఎడ్యూరప్ప పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి అయింది. కావాలని కోరుకున కర్ణాటక ముఖ్యమంత్రి పదవి లో కూర్చున్న ఎడ్యూరప్ప కు ఆ పార్టీ నేతలు తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో బలంగా ఉండే బీజేపీకి ఎంతో నమ్మకంగా ఉన్న ఎడ్యూరప్ప గత ఐదు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేసి ఇటీవల దాని పొందు కోవడం జరిగింది. మధ్యలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా కుంపటి పెట్టిన తర్వాత మళ్ళీ బిజెపి పార్టీ తో దోస్తీ కట్టి చివరాకరికి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఇటువంటి నేపథ్యంలో కర్ణాటకలో రింగు తిప్పాలని భావించిన ఎడ్యూరప్ప స్పీడుకి బిజెపి అధిష్టానం ముగ్గురు డిప్యూటీ సీఎం లను నియమించి కట్టడి చేసింది.

 

ముఖ్యమంత్రి స్థానంలో ఎడ్యూరప్ప కూర్చున్నా గాని అన్ని రకాలుగా అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలను మాత్రమే మాత్రమే రన్ అవుతున్న తరుణంలో...సీఎం పీఠంపై కూర్చున్నా గాని ఎడ్యూరప్ప కి సరైన శాటిస్ఫ్యాక్షన్ లేదని కర్ణాటక రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

 

ఇటీవల తన సీటు కోల్పోయే పరిస్థితిలో ఆదుకున్న ఎమ్మెల్యేలపై ఎడ్యూరప్ప ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్లకి మంత్రి పదవులు ఇవ్వాలని పదేపదే ప్రకటనలు చేస్తూ వస్తున్న తరుణంలో యడ్యూరప్పపై పార్టీలోనే మరికొంతమంది నేతలు మంత్రి పదవులను ఆశిస్తున్న వాళ్ళు యడ్యూరప్పకు విరుద్ధంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తూ బహిరంగంగానే ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నిర్ణయాలపై విమర్శలు చేస్తూ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనీసం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని కూడా ఎటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని పరిస్థితి ఉండటంతో ముఖ్యమంత్రిగా కూర్చుని కూడా మరో పక్క విమర్శలు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎడ్యూరప్ప ఎదుర్కొంటున్న తరుణంలో పాపం ఎడ్యురప్ప అంటూ సోషల్ మీడియాలో కర్ణాటకలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. మరికొంతమంది నీ పరిస్థితి చూస్తుంటే షుగర్ వ్యాధి వచ్చిన వాడి ముందు సంక్రాంతి స్వీట్లు పెట్టినట్లు ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగానే కర్ణాటక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వార్తలు వినపడుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: