ఏపీలో వాళ్ళిద్దరికీ గేట్లు మూసేసిన  కమలనాధులు.?
ఎపిలో‌ బిజెపి, జనసేన మధ్య పొత్తు ప్రజలకు మంచి చేస్తుందని బిజెపి రాష్ట్ర ఇంచార్జి  సునీల్ ధియోధర్ అన్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు.. అందుకే చారిత్రక నిర్ణయానికి‌ వేదికైందన్నారు. గురువారం విజయవాడలో పవన్ కళ్యాణ్, బిజెపి నాయకుల మధ్య జరిగిన అవగాహనా సమావేశం అనంతరం నాయకులందరూ మీడియా మాట్లాడారు. ఉత్తరాయణం తరహాలో ఈ పొత్తుతో  కమలం మరింత వికసిస్తుందని జోస్యం చెప్పారు. జగన్, చంద్రబాబులకు ప్రజలు‌ అవకాశం ఇచ్చినా వారు విఫలమయ్యారని విమర్సించారు. అవినీతి పాలన, కుటుంబ పాలనను తరిమికొట్టాలని ఐడియాలజీతో మేము కలిశామన్నారు. ఎపిలో టిడిపి, వైసిపిలతో ప్రత్యక్ష, పరోక్ష పొత్తు, అవగాహన ఉండదని చెప్పారు.

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోడీని ఇష్టపడే వ్యక్తిని అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
మనస్పూర్తిగా ఈ‌ కలయిక వల్ల బిజెపి అవసరం ఎపికి‌ చాలా ఉంది. అవినీతి రహిత నాయకులు అయితేనే మంచి పాలన అందిస్తారు. ఆ తర్వాత మా మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఇటీవల పెద్దలతో లోతుగా చర్చలు జరిపాం. ఎక్కడ గ్యాప్ వచ్చిందనే అంశాలను చర్చించాం. ఇక నుంచి బిజెపితో కలసి పయనించాలని నిర్ణయించాం. ఎపిలో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ ధియోధర్  నేతృత్వంలో కలిసి వెళతాం. కులతత్వం, అవినీతి పాలనను అంతం చేయాలనేది మా ఉద్దేశమని చెప్పారు.  గతంలో టిడిపి, ఆ తర్వాత జగన్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు
టిడిపి హయాంలో అన్ని‌వేల ఎకరాలు ఎందుకు అని నేను ప్రశ్నించాను. జగన్ వచ్చి రైతులు, మహిళల ను రోడ్డు మీద పడేశారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ, అభివృద్ధి కోసం అన్ కండీషనల్ గా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తు లో  అవగాహన లోపాలు లేకుండా చర్చించాం. ఇరు పార్టీ ల‌ నేతలతో కోఆర్డినేషన్  కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, జనసేన కలయిక తో‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. పాలెగాళ్ల రాజ్యంతో ప్రజలు‌ విసిగిపోయారు. టిడిపి, వైసిపి ల ప్రత్యామ్నాయ పార్టీ అధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 
ప్రజా సమస్యలు పరిష్కారానికి జిల్లాల‌ వారీగా పని చేస్తాంరాష్ట్ర రాజకీయాలలో ఈరోజు చాలా కీలక నిర్ణయాలు జరిగాయని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక‌ అంశాలపై చర్చించామన్నారు. ముఖ్య నాయకులు అందరూ తమ అభిప్రాయాలు వెల్లడించారని అయన తెలిపారు. 2014నుండి ఎపి లో జరుగుతున్న పరిణామాలు దృష్టి లో పెట్టుకున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. 2019ఎన్నికలలో టిడిపి లోపాలను ఎత్తి చూపి ఒక్క అవకాశం పేరు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని విమర్సించారు. రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని అధంపాతాళంలోకి‌ నెట్టాయని దుయ్యబట్టారు. అవినీతి, అరాచకం, కుటుంబ పాలన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇవన్నీ‌ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్..  బిజెపి తో కలిసి పని చేయాలని అన్ కండీషనల్ గా ముందుకు వచ్చారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నాం
జగన్ నియంత పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో  మంచి ఆలన, ప్రజలకు మేలు చేసేలా బిజెపి, జనసేన లు కలిసి పని చేస్తాయి. 2024 అధికారమే లక్ష్యం గా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతాం.

 జగన్, చంద్రబాబు పాలనలతో ప్రజలు విసిగిపోయారు. ఈ రెండు పార్టీలు అన్ని అంశాల పైనా కలిసి పోరాడతాం .ఈరోజు చారిత్రక నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఎపి రాజకీయాలలో చారిత్రక నిర్ణయం అని చెప్పక తప్పదని బిజెపి రాజ్యసభ సభ్యులు జి వి ఎల్ నరసింహులు అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో సమూల మార్పులు కు ఇది నిదర్శనం. బిజెపి తో సంబంధం ఉన్నట్లు ‌టిడిపి, వైసిపి లు‌ చెప్పుకున్నాయి. కానీ బిజెపి.. జనసేన తో మాత్రమే కలిసి 2024వరకు పయనిస్తాం. ఎపి లో అద్భుతమైన రాజకీయ ఫలితాలు సృష్టిస్తాం. కూటమిని ప్రధాన ప్రజలు తప్పని సరిగా ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకుంది. రెండు పార్టీ లు ఉత్సాహం తో ప్రజాక్షేత్రంలో దిగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: