తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఒక్కో నాయకుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఊసరవెల్లిని మరిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో సీటు దక్కని వారంత ఒకవైపు, సీటు సంపాధించిన వారంత మరో వైపు చేరిపోయి ఒకరి మీద మరొకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మరో సారి ఈ ఎన్నికల్లో విజయం సాదించి తన సత్తా చాటాలని ఊవ్విళ్లు ఊరుతుందట.

 

 

ఇలాంటి పరిస్దితుల్లో ఇప్పుడొక మాజీ మంత్రి చేసిన పని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ముఖ్యంగా గులాభి బాస్‌కు తల నొప్పిగా తయారైందట. అయితే ఇప్పటికే రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాలని భావిస్తున్న టీఆర్ఎస్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. అదేమంటే తన నియోజకవర్గంలోని స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించడమే కాకుండా, వారిని గెలిపించాలని ప్రచారం చేయడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.

 

 

ఇలా జరగడానికి కారణం ఏంటంటే హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన టీఆర్ఎస్‌లో చేరగా... పార్టీకి కొత్తవాడైన ఆయనకు టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్‌లు ఇచ్చే బాధ్యతను అప్పగించారు. ఈ విషయంలో జూపల్లి కృష్ణారావు, తీవ్ర అసంతృప్తితో ఉండి, కొల్లాపూర్‌లోని మొత్తం 20 వార్డుల్లో తన వర్గం వారిని ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

 

జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి... ఆయన తన మద్దతు దారులకు ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్‌కు అందించినట్టు తెలుస్తోంది. ఇకపోతే టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలను లైట్ తీసుకుని తన పని కానిచ్చుకుంటున్న జూపల్లి కృష్ణారావు విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పార్టీ వర్గాలతో పాటు జిల్లా రాజకీయాల్లోనే ఆసక్తి నెలకొంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: