పైకి కనిపించటం లేదు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్  లోలోపల పెద్ద వ్యూహంతోనే పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదేమిటంటే తొందరలోనే పవన్ కేంద్రానికి  వెళిపోతారని అంటున్నారు.  తన పావులు కదపటంలో భాగంగానే ముందుగా బిజెపితో పొత్తులు పెట్టుకున్నట్లు పార్టీ జనాలే అనుమానిస్తున్నారు. ఇపుడు బిజెపితో పొత్తులని చెబుతున్నా తొందరలోనే జనసేనను  విలీనం చేసేయటం ఖాయమని అర్ధమైపోతోంది.

 

ఒకసారంటూ బిజెపిలో జనసేన విలీనమైపోతే పవన్ కు రాష్ట్రంలో పెద్దగా పనుండదనే చెప్పాలి. పార్టీ తరపున ప్రచారం చేయటం, అభ్యర్ధుల విజయానికి కృషి చేయటం మినహా చేయగలిగేది కూడా ఏమీ ఉండదనే అనుకోవాలి. మరప్పుడు రాష్ట్రంలోనే ఉండి పవన్ ఏమి చేస్తారు ? ఏమీ చేయరు ఎందుకంటే చేయటానికి ఏమీ ఉండదు కాబట్టి. అందుకనే కేంద్ర రాజకీయాలవైపు వెళిపోయే ఆలోచనలో ఉన్నట్లు అనుమానంగా ఉంది.

 

ఈ విషయంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే  చిరంజీవి ప్రజారాజ్యంపార్టీకి 18 మంది ఎంఎల్ఏలు ఉండేవారు. జనసేనకు ఉన్నది ఒక్క ఎంఎల్ఏ మాత్రమే అంతే తేడా. ఎలాగూ కేంద్రంలో బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ బలంగానే ఉంది.  ప్రస్తుతం రెండు పార్టీలు కలవటం వల్ల ఉపయోగం కనబడింది అనటానికి పవన్ చాలా కష్టపడాల్సుంటుంది. అప్పుడే విలీనం తేలికవుతుంది. ఒకసారి విలీనం చేసేముందు ఎలాగూ బేరాలు తప్పవు.

 

అప్పుడు రాజ్యసభ ఎంపిగా అవకాశం తీసుకుని కేంద్రమంత్రివర్గంలోకి దూరేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే పవన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఏ స్ధాయిలో కష్టపడాలో తనకు  బాగా తెలుసు.  జనసేనగా ఉన్నపుడు ఏదో పార్ట్ టైం రాజకీయాలతో నెట్టుకొచ్చారు. కానీ బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత పార్ట్ టైం రాజకీయాలు చేస్తానంటే కుదరదు.  బిజెపి అజెండాకు అనుగుణంగా నడుచుకోవాల్సుంటుంది. మరి పవన్ లో అంత ఓపికి ఉందా ? చూద్దాం ఏం జరగబోతోందో.

మరింత సమాచారం తెలుసుకోండి: