తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోవడంతో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ స్థానాలు గెలవాలని ఈ ఎన్నికలను కెసిఆర్ తన తనయుడు మంత్రి కేటీఆర్ చేతిలో పెట్టి పార్టీని ముందుకు నడిపించడానికి అన్ని కార్యచరణ ఏర్పాట్లు సిద్ధం చేశారు.

 

ఇటువంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇప్పించడానికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో టేప్ రూపంలో ఆడియో సోషల్ మీడియాలో రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ వైరల్ అయింది. ఈ ఆడియోలో బోడుప్పల్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. 

 

టికెట్ల కోసం మల్లారెడ్డి డబ్బులు అడిగిన సాక్ష్యాలు, రికార్డులు తన దగ్గర ఉన్నాయని రాపోలు రాములు చెబుతున్నారు. తనకు అన్యాయం చేశావని మల్లారెడ్డిని రాములు నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ ముందుంచుతానని హెచ్చరించారు. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో ఈ ఆడియో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా వెళ్లడంతో మల్లారెడ్డి పై తీవ్రస్థాయిలో అసహనంతో ఉన్నట్లు సమాచారం. దీంతో మరో పక్క ఈ ఆడియో టేప్ అడ్డం పెట్టుకుని విపక్ష పార్టీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రజాస్వామ్యాన్ని అవాస్తవాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే విషయం రోజురోజుకీ పెద్దది అవుతున్న తరుణంలో మల్లారెడ్డి పై వేటు పడే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: