తెలంగాణలో మరికొద్ది రోజులలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ ఎన్నికలుకు రాజకీయంగా కొత్త అవతారం ఎత్తింది.. మంచి.. పార్టీలో సీనియర్లు అని లేకుండా ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఆ టికెట్ ఇస్తున్నారు. అసలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓ టికెట్ ని లక్షల్లో.. కోట్లల్లో అమ్ముతున్నారు.. 

 

అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక త‌న కేబినెట్‌, ప్ర‌భుత్వంపై ఎలాంటి మ‌ర‌క‌లు లేకుండా ఉండేందుకు తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా నిర్దాక్షిణ్యంగా తీసిప‌డేస్తారు. ప‌క్క‌న పెట్టేస్తారు.     

 

ఇలా ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణ‌కు చెందిన ఓ మంత్రి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న మునిసిపాల్టీల్లో కౌంట‌ర్ ఓపెన్ చేసి మ‌రీ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఓసీల‌కు రు.50 ల‌క్ష‌ల‌, బీసీల‌కు రు.40 ల‌క్ష‌లు, చివ‌ర‌కు ఎస్టీల‌కు రు.30 ల‌క్ష‌లు.. పార్టీ కోసం కష్ట‌ప‌డిన వాళ్లు నాకు అవ‌స‌రం లేదు.. నాకు ఎవ‌రు డ‌బ్బులు ఇస్తే వాళ్ల‌కే సీట్లు అని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు. 

 

ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నాలుగైదు మునిసిపాల్టీలు ఉండ‌డంతో ఆయ‌న పంట పండింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై లెక్కకు మిక్కిలిగా ఆరోప‌ణ‌లు ఈ సారి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పార్టీ మునిసిపాల్టీల్లో ఓడిపోతే మంత్రి ప‌ద‌వి ఊడుతుంద‌ని కూడా గుస‌గుస‌లు..? మరి ఈ గుస గుసలలో ఎంత మాత్రం నిజం ఉంది అనేది ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప తెలియదు.. 

 

ఏది ఏమైనా ఇలాంటి అవినీతి మంత్రులు ఉంటె ఇంకా ఎప్పుడు బాగుపడతారు ప్రజలు ? పార్టీ కోసం అహర్నిశలు.. పార్టీ పెట్టినప్పటి నుండి కష్టపడినా వారికీ టికెట్ ఇవ్వకుండా ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడితే ఇంకా ఆ కార్యకర్తలకు విలువ ఏమి ఇచ్చినట్టు? ఆ మంత్రికి డబ్బే ప్రధానమా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: