తెలంగాణాలో రెండొవసారి ఆ పార్టీనే గెలించింది. ఏంలాంటి రిమార్క్ లేకుండా ఉండటానికి ముఖ్యమంత్రి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు.. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఏ తప్పు చేసిన సరే పార్టీ నుండి తీసి పడేస్తున్నాడు.. అలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలంగాణాలో ఓ డైనోసార్ లా పీక్కుతింటున్నాడు.          

 

తెలంగాణలో మరికొద్ది రోజులలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ ఎన్నికలుకు దున్నుకున్నోడి దున్నుకున్నంత అన్నట్టు తెలంగాణ‌కు చెందిన ఓ మంత్రి స్వ‌త‌హాగా ఆయ‌న డ‌బ్బుల‌తోనే రాజ‌కీయం చేస్తార‌న్న టాక్ ఉంది. గ‌తంలో ఓ పార్టీలో ఉండ‌గా రేవంత్‌రెడ్డికి రావాల్సిన సీటును ఆయ‌న డ‌బ్బుల‌తో కొనుక్కున్నార‌న్న టాక్ ఉంది. ఆ త‌ర్వాత కాలం క‌లిసి వ‌చ్చి ఆయ‌న మంత్రి అయ్యారు.              

 

ఇక ఇప్పుడు ఆయ‌న తాను ప‌ద‌వి నుంచి దిగిపోయే లోగా కోట్లు టార్గెట్‌గా పెట్టుకుని మ‌రీ కౌంట‌ర్లు ఓపెన్ చేసేశార‌ట‌. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌ర శివార్ల‌లో ఉండ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ జోరుగా న‌డుస్తోంది. అందుకే పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు. పార్టీ పుట్టిన‌ప్పటి నుంచి ఉన్న వాళ్ల‌ను కాద‌ని తాజాగా జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ల‌క్ష‌ల‌కు అమ్ముకుంటున్నారు. 

 

తంతే గారెల బుట్టలో పడ్డాడు అన్న‌ట్టుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే నాలుగైదు మునిసిపాల్టీలో ఉండ‌డంతో ఆయ‌న టిక్కెట్లు అమ్ముకునేందుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక త‌న‌కు ఇబ్బంది లేకుండా త‌న బంధువుల‌తో కౌంట‌ర్లు ఓపెన్ చేయించి. ఎవ‌రైనా ప‌నులు కావాల్సిన వారు బంధువుల‌కు ముడుపుల సంచులు ఇచ్చేస్తే ప‌నులు చేసేస్తామ‌ని చెప్పేస్తున్నార‌ట‌. ఇది ఆ మంత్రి నిర్వాకం.. ఆ మంత్రిపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయట.. అయినప్పటికీ ఇంత వరుకు ఏటివంటి రియాక్షను లేదు.. ఒకవేళ రియాక్ట్ అవుతే ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: