ఎంతో కష్టపడి.. ప్రజల వద్ద మంచి పేరు తెచ్చుకొని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోవసారి అధికారంలోకి వచ్చారు. ఆలా అధికారంలోకి వ‌చ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న కేబినెట్‌, ప్ర‌భుత్వంపై ఎలాంటి మచ్చలు, మ‌ర‌క‌లు లేకుండా ఉండేందుకు తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 

 

ఎవ‌రైనా త‌ప్పు చేస్తే అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా నిర్దాక్షిణ్యంగా తీసిప‌డేస్తారు. ప‌క్క‌న పెట్టేస్తారు. గ‌త ట‌ర్మ్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజ‌య్య‌నే ఆయ‌న కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసి ప‌డేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఆయ‌న ఎంతో న‌మ్మి మ‌రీ మంత్రి ప‌ద‌వి ఇచ్చిన ఓ మంత్రి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

 

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా పూచిక పుల్ల‌లా తీసిప‌డేస్తున్నార‌ట‌ ఆ మంత్రి. కార్య‌క‌ర్త‌లు అయినా, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డా వారైనా... పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి ఉన్నా ఆయ‌న‌కు అన‌వ‌స‌రం.. డ‌బ్బు సంచ‌ల‌తో వ‌చ్చే వాళ్ల‌కే ప‌నులు, ప‌ద‌వులు ఇస్తాన‌ని ఖ‌రాఖండీగా బేర‌సారాలు ఆడేస్తున్నార‌ట‌. 

 

ఈ విష‌యంలో ఎంత వాళ్లు అయినా ఆయ‌న స‌హించ‌డం లేదంటున్నారు. నువ్వు డ‌బ్బులు తీసుకుంటున్నావు.. కేసీఆర్‌కు చెపుతాన‌ని అన్నా చెపితే చెప్పుకో అని స‌ద‌రు మంత్రి అంటున్న‌ట్టు భోగ‌ట్టా.. దీనిని బ‌ట్టి ఆ మంత్రి ఎలా తెగించాడో తెలుస్తోంద‌ని గుస‌గుస‌లు. అంతేకాదు.. ఒక్కో సీటు కొన్ని లక్షలకు.. కోట్లకు అమ్ముతున్నాడట.. ఓసి వారు అయితే 50లక్షలు.. బీసీ వారు అయితే 40లక్షలకు.. ఎస్సి ఎస్టీలు అయితే 30లక్షలకు అమ్మేస్తున్నారట.. ఇది ఆ మంత్రి తీరు.. 

 

అంతేకాదు.. అతని నియోజకవర్గంలో దాదాపు 5మున్సిపాలిటీలు ఉన్నాయట.. ఇలా సీట్లు అమ్ముతున్నావ్ అని ఎవరికి చెప్పిన సరే.. వినడట.. ఆఖరికి ముఖ్యమంత్రికి చెప్తా అన్నకూడా వినటం లేదు అని గుస గుసలు.. మరి ఈ గుస గుసలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: