జనవరి 17 న లోకి తొంగి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం : బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి అమెరికా విప్లవం లో పాల్గొన్నాడు. అమెరికా విప్లవం ముందుండి నడిపించాడు. 1706 జనవరి 17వ తేదీన జన్మించారు. అమెరికా విప్లవం లో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరుగా ఉన్నారు. ఈయన ఒక గొప్ప రచయిత చిత్రకారుడు రాజకీయ నాయకుడు శాస్త్రవేత్త మేధావి. బహుముఖ ప్రజ్ఞాశాలి గా  బెంజమిన్ ఫ్రాంక్లిన్ కు గొప్ప పేరు ఉంది. అంతేకాకుండా ఖగోళశాస్త్రంలో ఈయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఈయన కనిపెట్టిన చద్వారపు  కళ్ళద్దాలు.. మడోమీటర్ మొదలగునవి చాలానే ఉన్నాయి. ఈయన మొదటి అమెరికన్ అనే బిరుదును కూడా పొందాడు. ఈయన 1790 సంవత్సరంలో మరణించారు.

 

 జార్జ్ స్టిగ్లర్ జననం : ప్రముఖ ఆర్థికవేత్త అయిన జార్జ్ స్టిల్... ఆర్థిక శాస్త్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1911 జనవరి 15వ తేదీన జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో జార్జ్ స్టిగ్లర్  చేసిన కృషికిగాను ఏకంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు.

 

 

 ఎం.జి.రామచంద్రన్ జననం : సినిమాల్లో నటుడిగా తన తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు ఎంజీ రామచంద్రన్... ప్రేక్షకుల గుండెల్లో ఎంజీఆర్ గా  చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నో ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశారు. 1915 జనవరి 17వ తేదీన ఎంజిఆర్ జన్మించారు. 1977 సంవత్సరం నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా కొనసాగారు ఎంజీఆర్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో కూడా కొత్త పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పటికీ తమిళనాట రాజకీయాల్లో  ఎంజిఆర్ పేరు మార్మోగిపోతోంది. ఎం.జి.రామచంద్రన్ పురచ్చి తలైవర్ తమిళ ప్రజలు గుండెలో చెరగని  మొద్ర వేసుకున్నారు. ఇక తమిళనాట అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జయలలిత కూడా ఈయన  కారణంగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా  ఈయన డిసెంబర్ 24 1987 సంవత్సరంలో మరణించారు.

 

 ఎల్.వి.ప్రసాద్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అక్కినేని లక్ష్మి వరప్రసాద్రావ్ . ఈయన ఒక గొప్ప సినీనిర్మాత దర్శకుడు మరియు నటుడు. ఎల్.వి.ప్రసాద్ జనవరి 17 1908 సంవత్సరంలో జన్మించారు. నిర్మాతగా ఎల్.వి ప్రసాద్ నిర్మించిన మొదటి చిత్రం షావుకారు సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా అలనాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాలను తెరకెక్కించి నిర్మించారు ఎల్.వి.ప్రసాద్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమకే ఖ్యాతిని  పెంచారు ఎల్.వి.ప్రసాద్. పరిశ్రమలోనే అత్యుత్తమ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు ఎల్.వి.ప్రసాద్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎల్.వి.ప్రసాద్ చేసిన సేవలను ఇప్పటికీ అందరూ నెమరువేసుకుంటూ ఉంటారు. కాగా  నటుడిగా కూడా ఎల్.వి.ప్రసాద్ ఎన్నో సినిమాల్లో నటించారు.

 

 మహమ్మద్ అలీ జననం : విశ్వ విఖ్యాతి చెందిన బాక్సర్ మహమ్మద్ అలీ. ఈయన 1942 జనవరి 17వ తేదీన జన్మించారు. ఆయన మూడు సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తి శాలి. కాగా  ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళల బాక్సింగ్ విభాగంలో విజేతగా నిలిచిన గొప్ప వ్యక్తి.

 

 

 మడిపలి భద్రయ్య జననం : తెలంగాణ ప్రాంతానికి చెందిన మడిపలి భద్రయ్య 1945 జనవరి 17వ తేదీన జన్మించారు. ఈయన రచనలు అప్పట్లో బాగా ప్రాచుర్యం అయ్యాయి. మడిపలి భద్రయ్య ఉత్తమ ఉపాధ్యాయులు మరియు ఆధ్యాత్మిక వేత్త.

.

మరింత సమాచారం తెలుసుకోండి: