గత కొంతకాలంగా అమరావతి గురించిన ఇష్యూ సీరియస్ గా నడుస్తున్నది.  అమరావతిలో రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం మొదట సిద్ధంగా లేదు.  అమరావతిలో నిర్మాణాలు నిర్మించాలని అంటే ఖర్చు అవుతుంది.  ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అంతటి డబ్బు లేదు.  పైగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం చెప్తున్నది.  అంతేకాదు, బోస్టన్ గ్రూప్ కమిటీ ఇఛ్చిన నివేదికను సాకుగా చూపించి అమరావతి నుంచి రాజధానిని షిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  


అయితే, రాజధానిని మార్చేందుకు వీలులేదని గత కొన్ని రోజులుగా రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు.  ప్రతిపక్షాలు కూడా ఇదే విధమైన నిరసనలు తెలియజేస్తున్నాయి.  రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.  ఈ సమయంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు బయటకు పడ్డాయి.  అమరావతిలో నిర్మాణాలు నిర్మించాలి అంటే కష్టం అని, భూమిలో బలం లేదని, అలాంటి భూమిలో బలమైన పునాదులు నిర్మించి కట్టడాలు కట్టాలి అంటే దానికి ఖర్చు తడిసి మోపెడు అవుతుందని బోస్టన్ గ్రూప్ నివేదికలో తెలిపింది.  


ఈ నివేదిక పేర్కొన్న అంశాలను మద్రాస్ ఐఐటి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇచ్చినట్టు బోస్టన్ గ్రూప్ పేర్కొన్నది.  భూమిలో బలం లేదనే విషయం మద్రాస్ ఐఐటి నివేదిక ఇచ్చిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొంతమంది రైతులు మద్రాస్ ఐఐటికి మెయిల్ చేశారు.  బోస్టన్ గ్రూప్ నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమేనా కాదా అని మెయిన్ చేయగా, మెటీరియాలజి సంబంధించిన అంశం తమకు తెలియదని, తమ దగ్గర అలాంటి శాఖ లేదని, తాము ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని మద్రాస్ ఐఐటి స్పష్టం చేసింది.  


దీంతో అమరావతి రైతులు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.  బోస్టన్ నివేదిక తప్పుడు నివేదికలు ఇచ్చిందని, రాజధానిని మార్చాలి అని ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకుందని, అందుకే అమరావతిపై తప్పుడు నివేదికలు సృష్టిస్తున్నారని, ఇది దారుణం అని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు.  ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించడంతో ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: