పాములు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి... ఎంత ధైర్యవంతులైన పామును  చూస్తే కాస్త వెనుకడుగు వేస్తుంటారు. ఎక్కడైనా దారిలో వెళ్తుంటే పాము కనిపించింది అంటే అబ్బో భయంతో కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే. అంతలా భయపడుతుంటారు కొంతమంది పామును చూస్తే. అయితే ఈమధ్య బాత్రూంలోకి పాములు వస్తుండడం ఎక్కువైపోతుంది. బాత్రూం లో ఎప్పుడు పాముల బెడద ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇది మన దగ్గర కాదు లెండి ఆస్ట్రేలియా థాయిలాండ్ లో. తరచూ ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. టాయిలెట్  పాములు కనిపించగానే ప్రజలు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

 

 ఇప్పుడు థాయిలాండ్ లో  ఇలాంటి ఘటన జరిగింది. థాయిలాండ్ కు చెందిన ఓ మహిళ పాము తో పోరాడి పాము కి చుక్కలు చూపించినది . వివరాల్లోకి వెళితే... అనా అనే మహిళ బాత్ రూమ్ టాయిలెట్ మీద కూర్చుంది. అప్పటికే బాత్రూంలోకి దూరిన పామును ఆ మహిళ గమనించలేదు. దీంతో బాత్ రూం లోకి దూరిన  ఆ మహిళ తొడ మీద కాటు వేసింది. అయితే ఆ మహిళ మాత్రం అందులో పాము చూడగానే పరుగులు పెట్టి భయపడకుండా... ఆ పామును రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. దీంతో పాము ఆమె చేతులను చుట్టేసింది. దీంతో ఆ మహిళ బాత్రూంలో కేకలు వేసింది. 

 

 

 అయితే ఆ మహిళ కేకలు విన్న పిల్లలు తమ తల్లిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ మహిళ తనకు పిల్లలు తెచ్చిన కత్తితో చేతులకు చుట్టుకున్న పాము కోసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ పాము  మాత్రం పట్టు వదల్లేదు. అనంతరం సుత్తితో తో పాము తల మీద గట్టిగా కొట్టింది. దీంతో ఆ పాము పట్టువదలింది . కాగా ఈ ఘటనలో ఆ మహిళకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా  ఆ మహిళ కుమార్తె ఫేస్బుక్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. గాయపడిన పాము ఫోటోను పోస్ట్ చేసింది. ఒక ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించి ఏకంగా  61వేల మందికి పైగా ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లి క్షేమంగానే ఉందని తెలిపింది  మహిళ కుమార్తె.

మరింత సమాచారం తెలుసుకోండి: