పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం వామపక్షాలు చాలా కోపంగా ఉన్నాయి.  వామపక్ష భావజాలం, జాతీయ భావజాలం అధికంగా ఉన్న పవన్ కళ్యాణ్, వామపక్షాల వలన పెద్దగా ఉపయోగం లేకపోవడంతో  ఆ పార్టీని క్రమంగా పక్కన పెడుతూ వచ్చారు.  పేరుకే వామపక్షాల భావజాలం, ఆ పార్టీలు చేసేదంతా కూడా బూర్జువా వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. నిజమైన వామపక్ష భావజాలం ఎప్పుడో చచ్చిపోయింది.  ఇప్పుడు అంతా రాజకీయ భావజాలం మాత్రమే.  ఈ విషయం పవన్ కళ్యాణ్ గ్రహించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.  

 

జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా వామపక్షాలు ప్రవర్తిస్తున్నాయి.  దీంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు.  సిఏఏ, ఎన్పీఆర్ ను వ్యతిరేకించడంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీలను పూర్తిగా దూరంగా పెట్టారు.  ఎందుకంటే, మైనారిటీలు ఇబ్బందులు పడతారని, దేశాన్ని మత ప్రాతిపదికన బీజేపీ విడదీస్తోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.  బీజేపీ మాత్రం అలాంటిది ఏమి లేదని, సిఏఏ వలన ప్రజలకు వచ్చిన ఇబ్బందులు లేవని, కేవలం ఆ మూడు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే బిల్లు మాత్రమే ఇది అని బీజేపీ చెప్తున్నది.  


కానీ, వామపక్షాలు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ప్రజల్లో ఈ బిల్లు గురించి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది.  దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నిశితంగా గమనించిన పవన్ కళ్యాణ్ వామపక్షాలను కాదని చెప్పి బీజేపీతో చేతులు కలిపారు.  దేశాన్ని సురక్షితంగా ఉంచాలి అంటే బీజేపీ ఒక్కదాని వలనే సాధ్యం అవుతుందని బలంగా నమ్మారు.  అందుకే పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో చేతులు కలిపారు.  


అంతేకాదు, అమరావతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్స్ తీసుకోబోతున్నారు.  అమరావతి రైతుల కోసం పోరాటాన్ని మరింత పెంచేందుకు సిద్ధం అవుతున్నారు.  ఒంటరిగా పోరాటం చేస్తే కుదరని పని. అదే విధంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటం చేసినా ప్రజలు నమ్మరు.  ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది.  వామపక్షాలు మాటలు చెప్పడానికి పరిమితం అంతకు మించి ఏమి చేయలేదు.  రాష్ట్రంలో ఆ పార్టీల పరిస్థితే ప్రశ్నర్ధకంగా ఉన్నది.  ఈ సమయంలో ఆ పార్టీల సపోర్ట్ కంటే బీజేపీ సపోర్ట్ ఉంటేనే పోరాటం చేయగలం అని పవన్ నిర్ణయించుకున్నాడు.  అందుకే ఆ పార్టీతో చేతులు కలిపాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: