చిన్నపిల్లలకు పెరుగుతున్న కొద్దీ.. వారు వేసుకునే చెప్పులు మారుతూనే ఉండాలి. దీంతో బిజీ బిజీగా గడుపుతున్న తల్లిదండ్రులు కొన్ని కొన్ని సార్లు ఊరికే చెప్పులు మార్చడానికి విసుక్కుంటూ  ఉంటారు. అయితే పెరుగుతున్న  తమ పిల్లలతో పాటు చెప్పులు కూడా పెరుగుతే ఎంత బాగుండు అని అనుకొని తల్లిదండ్రులు ఉండరు. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికి పాదాల పరిమాణం కూడా పెరుగుతుంది కాబట్టి చెప్పుల సైజు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇక చెప్పులు కూడా చాలా స్టైల్స్ ఉంటాయి... వాళ్ల పిల్లలకు నచ్చే చెప్పులను  కొనిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇలా పిల్లలు పెరుగుతున్న కొద్ది ఎన్నో రకాల చెప్పులు కొని ఇవ్వాల్సిందే కదా. 

 

 

 అయితే పెరుగుతున్న పిల్లలతోపాటు చెప్పులు కూడా పెరిగితే ఎంత బాగుండు. ఒకవేళ చెప్పుల లో ఇలాంటి ఫెసిలిటీ ఉంటాయి బాగుండు కదా అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా పిల్లల వయస్సు తో పాటు పెరిగే చెప్పులు  ఇప్పటివరకైతే రాలేదు కదా. ఒక వ్యక్తి మాత్రం చిన్నపిల్లలు వేసుకోవడానికి చెప్పులు తయారు చేశాడు. ఈ చెప్పులు  స్పెషాలిటీ ఏమిటంటే... పిల్లల వయస్సు తో పాటు ఈ చెప్పులు  కూడా పెరుగుతూ ఉంటాయి. దీంతో పిల్లలు ఎంత ఏజ్ పెరిగినప్పటికీ  కూడా చెప్పులు వాళ్ళ కాళ్ళకి సరిపోతూ  ఉంటాయి. 

 

 

 అదేంటి పిల్లలు వయసుతోపాటు చెప్పులు పెరగడం ఏంటి అలా కూడా జరుకుతుంద అంటారా... కానీ ఇక్కడ ఓ వ్యక్తి  తయారుచేసిన చెప్పులతో మాత్రమే ఇది జరుగుతుంది. కెన్యాలో చిన్నపిల్లలు వేసుకోవడానికి కాళ్లకు చెప్పులు లేక ఇబ్బంది పడతున్నారు...  అందుకు వచ్చిన ఓ పరిష్కారం అద్భుతంగా ఉంది. కెన్యాలో పిల్లలకు కెంటన్  లీ అనే వ్యక్తి అద్భుత ఆలోచన చేసే చెప్పులు తయారు చేశాడు. ఏడాది వయసున్న పిల్లల దగ్గర నుంచి ఐదేళ్ల వరకు పనికొచ్చేలా చెప్పుల రూపొందించాడు ఆ వ్యక్తి . అంటే చప్పులు  ఐదు సంవత్సరాల వరకు పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఈ చెప్పులకు ముందు వెనుక పక్కన క్లిప్పుల తో పెద్దగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీంతో ఐదు సంవత్సరాల పాటు పిల్లలు ఈ చెప్పులను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: