టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు అవ‌కాశ‌వాద రాజ‌కియాలు చేయ‌డంలో ఆయ‌నను మించిన‌వారు ఎవ‌రూలేరు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే టిడిపిని బ్ర‌తికించుకునేందుకు మ‌రోసారి ఎన్టీఆర్‌ కుటుంబాన్ని బాబు వాడుకుంటున్న సంగ‌తి స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఆల్రెడీ హిందూపురం ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ‌ను, గ‌తంలో హ‌రికృష్ణను రాజ‌కీయాల్లో దించిన సంగ‌తి తెలిసిందే. దీంట్లో భాగంగానే ఆయ‌న మ‌రో వారుసుడు రామ‌కృష్ణ కూడా ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల పై  ఈ విధంగా స్పందించారు.

 

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌రిగే ప‌రిణామాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల పైన మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ స్పందించారు. మాజీ సీఎం టిడిపి అధినేత అయిన చంద్ర‌బాబు పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన‌ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే హోదాలో ఉన్నాన‌న్న విష‌యం కూడా మ‌రిచిపోయి ఆయ‌న నోరు జారార‌ని ద్వారంపూడి కామెంట్ల పై రామకృష్ణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు.

 

ఆయ‌న మాట్లాడే తీరు మార్చుకోవాలంటూ... లేదంటే తాము నోరు తెరిస్తే ఆయ‌న బండారాన్ని ఎలా బ‌య‌ట‌పెట్టాలో తెలుస‌ని అన్నారు. మీరు మీ నోటికి వ‌చ్చిన‌ట్లు ఎలా ప‌డితే అలా ప‌డ‌మ‌ని మేమేమి గాజులు తొడుక్కుని క్యూర్చోలేద‌ని కాస్త గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. క‌నీసం చంద్ర‌బాబు వ‌యసు, అనుభ‌వానికైనా విలువివ్వాల‌ని. ఆయ‌నతో స‌రితూగ‌గ‌ల‌వా అంటూ ప్ర‌శ్నించారు. అలాగే టీడీపీ ఒక సంస్కారం ఉన్న పార్టీ. మాట‌కు మాట చెప్ప‌డం మాకు చేత‌న‌వుద్ది. ఏమున్నా రాజ‌కీయంగా ఎదుర్కోవాల‌ని అంతేగాని ఫ్యామిలీ జోలికి రావొద్దంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. చంద్ర‌బాబు ఎన్టీఆర్ మూడో అల్లుడు, మా బావ అనే విషయం గుర్తుపెట్టుకోమ‌న్నారు. ఏదైనా మాట్లాడేట‌ప్పుడు స‌భ్య‌త సంస్కారం ఉండాల‌న్నారు. 

 

అమ‌రావ‌తి రైతుల విష‌యం  ప్ర‌స్తావించిన‌ప్పుడు చంద్ర‌బాబుని అసభ్య పదజాలంతో దూషించారు. వెధవ అని తిట్టాలని ఉందంటూ ఫైరయ్యారు. తన బినామీల కోసం చంద్రబాబు.. అమరావతి పరిరక్షణ పేరుతో బస్సుయాత్ర చేపడుతున్నారని విమర్శలు గుప్పించారు. అలాగే ఆయ‌న హ‌యాంలో చంద్ర‌బాబు ఎన్నో వెధ‌వ ప‌నులు చేవార‌న్నారు. ఎంత మాట వ‌స్తే అంత మాట మాట్లాడ‌టం కాద‌ని కాస్త నోరునుఅదుపులోపెట్టుకోవాల‌ని సూచించారు. వాడెవ‌డో వీడెవ‌డో అంటూ మేం కూడా నోరు జారి మాట్లాడితే.. కానీ మా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సంస్కారం మ‌రిచిపోయి మాట్లాడ‌రు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: