ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల సమయం కంటే ఇప్పుడు మరీ దారుణంగా చాలా వేడిగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతానికి అనుగుణమైన నేల కాదని భూకంపాలకు మరియు వరద ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని కేంద్ర కమిటీలు కొన్ని అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నివేదిక ఇచ్చినా గాని వాటిని బేఖాతరు చేసి చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కొన్ని వేల భూమి ఎకరాలను మూడు పంటలు పండే భూములు ఆ ప్రాంతంలో ఉన్న రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది.

 

అయితే ఈ సందర్భంలో అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడంవల్ల ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వ భూములు కలిగిన చోట చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేయాలని...ఈ విధంగా బలవంతపు భూసేకరణ చేసి రాజధాని ఏర్పాటు చేయటం పట్ల వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో తీవ్రంగా విభేదించారు. కాగా ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సందర్భంలో అప్పటి పాలకులు అంతా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి పొరపాటు చేయటం జరిగిందని విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని భవిష్యత్తులో ఇటువంటి సమస్య మళ్లీ రాకుండా ఉండాలంటే అంతటా అభివృద్ధి జరగాలని అమరావతిలో రాజధాని కొనసాగిస్తూ వైజాగ్ మరియు కర్నూలు వంటి ప్రాంతాలలో కూడా రాజధానిని విస్తరింప చేయాలని వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది.

 

దీంతో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టిడిపి పార్టీ నాయకులు వైయస్ జగన్ పరిపాలనను తుగ్లక్ పరిపాలన తో పోలుస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ తరచూ ఈ విధంగానే రాజధానులు మార్చే వాడని రోజుకో విధంగా రాజధాని గురించి వైయస్ జగన్ మాట్లాడుతున్నారని తుగ్లక్ పరిపాలన తో వైయస్ జగన్ పరిపాలన పోల్చిన నేపథ్యంలో...టిడిపి నాయకులు చేసిన ఈ కామెంట్ల పై అమరావతి ప్రాంతం మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్రస్థాయిలో వైయస్ జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలన అన్న వారిపై ఫైర్ అయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ప్రజలు అంటే కేవలం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదు మిగతా సామాజిక వర్గ ప్రజలు కూడా ఉన్నారు. దురుద్దేశంతో చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసి తన సామాజిక వర్గం ప్రజలను పైకి తీసుకురావాలని మిగతా వాళ్ల భవిష్యత్తు ఏమైనా పర్లేదు అన్న విధంగా వ్యవహరించారని కానీ వైఎస్ జగన్ వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు ఏర్పాటు అభిప్రాయం చాలా కరెక్ట్ అని ...ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్టణంలో ఆర్థిక రాజధాని ఉంటే తప్పేంటి అసలు మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టకుండానే విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి అదేవిధంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే వెనుకబడిపోయిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది.

 

భవిష్యత్తులో రాష్ట్రం మరొకసారి విడిపోకుండా ఉంటుంది వైయస్ జగన్ పరిపాలన సామాన్యుడు మరియు పేద వాళ్ళు అందరూ మెచ్చే పరిపాలన అసలైన తుగ్లక్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు అని...ప్రత్యేక హోదా వంటి విషయాలలో తుగ్లక్ కంటే దారుణంగా మాట మార్చారని...రైతుల రుణమాఫీ అని రైతులను మోసం చేశారని కాపులను బీసీల్లో చేరుస్త అని చెప్పి కాపులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ తుగ్లక్ టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చోడు లాగా మాట్లాడకూడదని అభివృద్ధి అంతట జరిగితేనే రాష్ట్రమంతా బాగుంటుంది అని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: