ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఓ పది రోజుల నుంచి ఏం చెబుతున్నారు.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏమంటున్నాడు.. రాష్ట్రానికి ఇది కష్టకాలం.. ఈ సమయంలో మనం పండుగలు చేసుకోకూడదు.. సంక్రాంతిని కూడా అమరావతి సంక్రాంతిగా చేసుకుందాం.. అందుకే నేను కూడా పండుగ చేసుకోవడం లేదు. ఏటా సంక్రాంతికి మా నారావారి పల్లె వెళ్లే వాళ్లం.. కానీ ఈసారి మేం పండుగు చేసుకోవడం లేదు... ఒకటే ఊదరగొడుతున్నారు.

 

కానీ ఏపీలో సంక్రాంతి సంబరాలు చూస్తుంటే.. చంద్రబాబు మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు ఈ ఏడు కూడా అంబరాన్నంటయ్యాయి. ఇప్పుడు ఇదే పాయింటుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. సంక్రాంతి పండగ చేసుకోవద్దని పిలుపు ఇచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను ఎవరూ పట్టించుకోలేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో కామెంట్లతో కుమ్మేశారు.

 

'పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు' అని విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.

 

అక్కడితో ఆగారా.. 'ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్‌ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?' అని మరో ట్వీట్ లో కుమ్మేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: