ఒక వైపు సంక్రాంతి పండుగ ఇంతలోనే మున్సిపల్‌ ఎలక్షన్స్. ఇంకేముంది. ఖర్చులన్ని వెళ్లిపోతాయి. ఇదెలా అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే చీ వీళ్లు మారరు అని చీదరించుకునే జనం.. ముందుగా మారవలసింది నాయకులు కాదు. ప్రజలు అని ఎప్పుడు తెలుసుకుంటారో. ఎలక్షన్స్ ముందు నాయకులు రావడం పదో  పరకో పంచడం, తర్వాత ఆ పెట్టిన ఖర్చును అవినీతి పనులతో గుంజడం. ఈ తంతు అంత తెలిసిన నాటి నేటి ఓటరు ఆవేశంతో ఊగిపోతాడు, కాని తనవరకు వచ్చే సరికి సర్దుకు పోతాడు.

 

 

కరెక్ట్‌గా ఆలోచిస్తే వ్యవస్దలో లోపం లేదు. వ్యక్తిలో లోపం ఉంది. ఇది సరి చేసుకోనంతవరకు ఎవరి బ్రతుకులు బాగుపడవు. మద్య తరగతి మనుషులు మద్యలోనే ఉండిపోతారు. ఇకనైన పక్క వాళ్లను నిందించడం ఆపేస్తే కాస్తైనా సమాజంలో వాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇకపోతే ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో. అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముందుగానే తాయిలాల పంపిణీకి తెరతీశారు. భోగి, సంక్రాంతి, కనుమ నేపథ్యంలో వరుసగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలికల్లో విచ్చలవిడిగా ఇంటింటికీ పండుగ ప్యాకేజీలను సరఫరా చేశారట.

 

 

ఓటర్ల దగ్గరకు వెళ్లి మీరేం ఫికర్‌ కావద్దు అంటూ  భోగి నుంచి కనుమ వరకు పండుగ ఖర్చు మొత్తం మాదే అని తీయని మాటలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారట. కిలో మటన్‌ లేదా రెండు కిలోల చికెన్, పిండి వంటల కోసం 5 లీటర్ల వంట నూనె ప్యాకెట్లు, రెండు కిలోల బియ్యం, కిలో శనగ పిండి, ఉప్పు, పప్పు కారం వంటి పదార్థాలతోపాటు ఫుల్‌ బాటిల్‌ విస్కీ లేదా ఐదారు బీరు సీసాలతో ప్యాకేజీలు మూటగట్టి ఓటర్లకు పంపిణీ చేశారని సమాచారం..

 

 

ఇదే కాకుండా త్రిముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు డబుల్, త్రిబుల్‌ బోనంజాలు అందుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించనుండటం తెలిసిందే.. ఇలాంటి అవినీతికి అడ్డుకట్ట వేయలేని అధికారులు, అభ్యర్ధులు చెప్పిన్నట్లుగా తలాడించే ఓటర్లు ఉన్నంతకాలం న్యాయంగా ఆలోచించే వారికి అన్యాయం జరుగుతూనే ఉంటుందని కొందరు నిజమైన ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: