వ్యసనాలను బానిసైతే మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  మనిషి మానసికంగా తప్పులు చేయడానికి బానిస అవుతాడు.  అలానే తప్పులు చేసుకుంటూ పోతాడు.  ఒక్కసారి తప్పు చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెడితే, అదే ఓ అలవాటుగా మారిపోతుంది.  ఎంతగా వద్దని వారించినా సరే తప్పులు చేస్తూనే ఉంటాడు.  కేసుల్లో ఇరుకున్నా సరే అదే మార్గంలో పయనించేందుకు ఆసక్తి చూపుతుంటాడు.  ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది.  


ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి తప్పులు చేయడానికి బాగా అలవాటు పడ్డాడు.  ఎంతగా అలవాటు పడ్డాడు అంటే, ఆ తప్పులు చేయకుండా ఆ మనిషి ఒక్కక్షణం కూడా ఉండలేనంతగా అలవాటు పడిపోయాడు.  చిన్నతనం నుంచి గంజాయి, మత్తుపదార్ధాలకు బానిసగా మారిపోయాడు.  దానికోసం డబ్బులు కావాలి కాబట్టి ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు.  దీంతో సదరు వ్యక్తి డబ్బును సంపాదించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  అలా మొదలు పెట్టిన వ్యక్తి దొంగతనాలు చేయడానికి పూనుకున్నాడు.  


ఉదయం సమయంలో ఇంటింటికి  పేపర్ వేయడం అలవాటు చేసుకున్నారు.  అలా ఇంటింటికి వెళ్లి పేపర్ వేస్తూనే ఎక్కడ ఏ ఇంటికి తాళం వేసి ఉన్నదో తెలుసుకునేవాడు.  సాయంత్రం కాగానే ఆ ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టి విలువైన వస్తువులను దొంగతనం చేసేవాడు.  అలా దొంగతనం చేస్తూ అవసరమైన వస్తువులను దొంగిలిస్తూ పబ్బం గడుపుకునేవాడు. గతంలో ఈ వ్యక్తిపై కొన్ని కేసులు నమోదయ్యాయి.  


కానీ మారలేదు.  అంతేకాదు, ఒకసారి జైలుకు వెళ్లొచ్చాక దొంగతనాలు చేయడం మరింత ఎక్కువయ్యాయి.  25 ఏళ్ల వయసులోనే ఈ వ్యక్తిపై ఏకంగా 51 కేసులు నమోదయ్యాయి.  పోలీసులు ఇటీవలే ఈ దొంగను బంధించారు.  అతని వద్ద నుంచి నగలు, డబ్బులు, సెల్ ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.  చిన్న వయసులోనే ఇన్ని కేసులు ఏంటి అంటే ట్రాక్ రికార్డ్ అని అంటున్నాడు ఈ మియాపూర్ దొంగ.  

మరింత సమాచారం తెలుసుకోండి: