దేశంలో కొన్నింటికి చాలా మంచి డిమాండ్ ఉంటుంది.  అలా డిమాండ్ ఎక్కువగా ఉండే వాటిల్లో తేలు విషం కూడా ఒకటి.  తేలు విషయాన్నీ అనేక ఔషధాల్లో వినియోగిస్తారు.  ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు ఈ తేలు విషంతో చేసిన ఔషదాలు ఉపయోగకరంగా ఉంటున్నాయి.  అందుకే తేలు విషం ఇప్పుడు భారీగా ధర పలుకుతుంది.  గ్రాము విషయం ధర లక్షల్లో పలుకుతుంది.  అందుకే తేలు కనిపిస్తే  దాన్ని చంపకుండా పట్టుకొని విషం తీస్తున్నారు.  


ఇక తేళ్లను చాలామంది వ్యక్తులు స్మగ్లింగ్ చేస్తూ విషాన్ని తీస్తున్నారు.  ఇటీవలే చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇలానే చైనా నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు తేళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు.  అనుమానం వచ్చిన అధికారులు అతని బ్యాగ్ తెరిచి చూడగా అందులో తేళ్లు ఉన్నాయి.  షాక్ అయ్యారు.  సదరు ప్రయాణికుడికి లక్ష రూపాయల జరిమానా విధించి తిరిగి చైనాకు పంపించేశారు.  


వివరాల్లోకి వెళ్తే, చైనా నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు వచ్చేందుకు ఓ ప్రయాణికుడు టికెట్స్ బుక్ చేసుకున్నారు.  చైనా నుంచి ఫ్లైట్ శ్రీలంకలో ఆగింది.  శ్రీలంక లోని బండార నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన సదరు వ్యక్తి అక్కడ అనుమానంగా తిరగడం కస్టమ్స్ అధికారులకు కనిపించింది.  అనుమానం వచ్చిన అధికారులు, ఆ వ్యక్తిని సోదా చేశారు.  లగేజ్ బ్యాగ్ తెరిచి చూడగా అందులో దాదాపుగా 200 తేళ్లు ఉన్నాయి.  


దీంతో కష్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు.  ఎందుకు ఆ తేళ్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తే ఎలాంటి సమాధానం చెప్పలేదు.  పైగా సైలెంట్ గా ఉన్నాడు.  దీంతో అధికారులు ఆ ప్రయాణికుడికి లక్ష రూపాయల జరిమానా విధించారు.  అలా జరిమానా విధించిన తరువాత వ్యక్తిని అక్కడి నుంచి తిరిగి చైనా పంపించేశారు.  200 అతి ప్రమాదకరమైన తేళ్ల నుంచి కనుక విషం తీస్తే ఆ విషం ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో పలుకుతుంది.  అందుకే ఈ పని చేసి ఉంటాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: