జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలన్న విషయం మీద జరిగిన  రెండు పార్టీల నేతల్లో ఏకాభిప్రాయం రాలేదని సమాచారం. ఇక్కడ ప్రధానంగా రాజధాని అమరావతి తరలింపు ప్రతిపాదన మీదే రెండు పార్టీల నేతలు చర్చించారు.  విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేసుకోవటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్  పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సరే పవన్ కంటూ ఓ స్ధిరభిప్రాయం లేదన్న విషయం ఇప్పటికే అర్ధమైపోయింది.

 

అదే సమయంలో బిజెపి నేతల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనపై బిన్నాభిప్రాయాలున్న విషయం అందరికీ తెలిసిందే. కొందరు అంటే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కొందరు జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి వాళ్ళు  జగన్ ప్రతిపాదనకు న్యూట్రల్ గా ఉన్నారు.

 

వ్యతిరేకిస్తున్న కన్నా ఏమో టిడిపి ఫిరాయింపు బిజెపి ఎంపి సుజనాచౌదరి లాంటి వాళ్ళకోసమే జగన్ ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిపోతోంది. అంటే జగన్ ప్రతిపాదనపై బిజెపిలోనే భిన్నాభిప్రాయాలున్న విషయం స్పష్టమవుతోంది. తాజగా బిజెపి, జనసేన నేతల  సమావేశంలో కూడా ఇదే విషయమై చర్చ జరిగినట్లు సమాచారం. మరి దీనిపై ఎంతసేపు చర్చ జరిగినా అవుట్ కమ్ ఏమిటో బయటకు రాలేదు.  

 

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపైనే ఏకాభిప్రాయానికి రాలేకపోయిన నేతలు ఇక జగన్ ను ఏ విధంగా ఐక్యంగా ఎదుర్కొంటారనేది పెద్ద ప్రశ్న. నిజానికి రాజధాని తరలింపు అన్న అంశంతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నది వాస్తవం. ఈ విషయం తెలిసినా జగన్ ను ఏదో బ్లాక్ మెయిల్ చేద్దామన్న దురాలోచనతోనే బిజెపిలోని ఓ వర్గం తెగ తాపత్రయపడుతోంది. ఇటువంటి వాళ్ళంతా చంద్రబాబునాయుడు ప్రయోజనాలు కాపాడటమే ఏకైక ధ్యేయంగా ముందుకెళుతున్నారు. ఈ విషయాన్ని బిజెపిలోని రెండో వర్గం పరిగట్టింది   కాబట్టే  మొదటి వర్గంతో కలవటం లేదు. మరి ఈ నేపధ్యంలో కలిసిన రెండు పార్టీలు జగన్ ను ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: