పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన పార్టీని స్థాపించారు. అయినప్పటికీ ఏక్కడ విజయం సాధించలేకపోయారు పవన్ కళ్యాణ్. అయితే విజయం సాధించలేక పోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఆంధ్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ విషయంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ కు  సపోర్ట్ చేయకపోయినప్పటికీ తనదైన స్టైల్లో దూసుకుపోతు ఉన్నారు. ఇక ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు కూడా. 

 

 

 ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో కలిసి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బీజేపీ కీలక నేతలందరితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో  బిజెపి తో పొత్తు పెట్టుకుని జనసేన బీజేపీతో నడవాలని నిర్ణయించింది. బిజెపి జనసేన పొత్తు ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. ఇకపోతే తాజాగా బీజేపీ తో జనసేన పొత్తు పై స్పందించిన జనసేన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పొత్తుకు ముందు వివిధ దశల్లో రెండున్నర నెలలపాటు చర్చించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆషామాషీగా ఏమి పొత్తు  పట్టుకోలేదని అన్నీ చర్చించి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాతే పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. 

 

 

 జనసేన పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీల్ల  కాదని... తాము ఎప్పుడు జాతీయ సమైక్యతను కోరుకుంటాము అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయాల్లో  బిజెపికి తమకు భావ సారూప్యత ఉంది అంటూ తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం పైన తనకు నమ్మకం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్... దేశం అభివృద్ధి కోసం మోదీ అనుసరించే విధానాలు మార్గాలు తనను  కట్టి పడేసాయి అంటూ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తుకు ప్రయత్నించినా కుదరలేదు అని తెలిపిన పవన్ కళ్యాణ్... ఇప్పటికీ సాధ్యమైంది అంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో తప్పక విజయం సాధించి అధికారంలోకి వచ్చి చూపెడతామంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేనాని.

మరింత సమాచారం తెలుసుకోండి: