సినిమాలో  స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేవ చేయడానికి జనసేన పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లారు. అయితే మొదట  టీడీపీకి మద్దతు పలికిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది.. కానీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం రెండు స్థానాల్లో ఓడిపోగా...  పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం మాత్రమే దక్కింది. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ నిర్ణయాలకు పవన్ ఆలోచనలకు విరుద్ధంగా అధికారపార్టీకి మద్దతు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఉంటే జనసేన కు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఆంధ్ర రాజకీయాల్లో తనదైన విమర్శలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ తాజాగా బిజేపి తో పొత్తు పెట్టుకోవాలని భావించారు. 

 

 

 ఇక మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఏపీ బీజేపీ కీలక నేతలతో సమావేశమై బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు నడవాలని నిర్ణయించారు. ఎన్నికల్లో బిజెపి తో పోటీ చేయడంతోపాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో కూడా బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించింది జనసేన. అటు బీజేపీ పార్టీ కూడా జనసేనతో పొత్తు అంగీకరించింది. దీంతో గ్లాసులో కమలం వికసించినట్లయింది . ఇకపోతే తాజాగా బిజేపి తో పొత్తు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం ఇప్పటిది కాదని... ఎలక్షన్ అప్పుడే  బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన భావించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

 

 కానీ అప్పుడు బిజెపితో పొత్తు కుదరలేదని... ఇప్పుడు మాత్రం బీజేపీతో పొత్తు కుదిరింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే బిజెపితో పొత్తు ఆషామాషీగా పెట్టుకోలేదని అన్ని  చర్చించి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము  అంటూ చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకం తోనే ఆయన దేశ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాలు నచ్చి  బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీలల  కాదని జాతీయ సమైక్యతను జనసేన పార్టీ కోరుకుంటుంది అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: