రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ప్రజలను బురిడీ కొట్టించి అకౌంట్ లో నుంచి డబ్బులు ఖర్చు కాచేయడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు.  ముఖ్యంగా నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు ఉపయోగించే వివిధ యాప్స్  కస్టమర్ కేర్ నెంబర్ ల పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్ల ఉంచి సమస్యల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే మాటల్లో దింపి సమాచారం తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ కొనుగోలు యాప్ లు  రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే... అయితే కొనుగోలు యాప్ లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తూ ఉంటారు ప్రజలు. దీంతో ప్రజల  అవసరమే ఆసరాగా తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ల ప్లేస్ లో నకిలీ  నెంబర్ ఉంచుతున్నారు.. వినియోగదారుడు ఆ నెంబర్లకు ఫోన్ చేయగానే మాయమాటలు చెప్పి ఉచ్చులోకి దింపే వివిధ వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. 

 

 

 ఇటీవలే ఓ యువకుడు విషయంలో ఇదే జరిగింది. జొమాటో చెందిన 200 విలువైన ఆహారం తెచ్చుకున్నాడు. అయితే ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో దుర్వాసన రావడంతో ఫిర్యాదు చేసేందుకు గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్   తెలుసుకున్నాడు. ఇక ఆ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే  నేరుగా సైబర్ క్రైమ్ నేరగాళ్లకు కాల్ వెళ్ళింది.. ఆ యువకుని మాయమాటలు చెప్పి యూపీఐ నెంబర్ ఖాతా నెంబర్ పంపించాలని తిరిగి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. బాధితుడు  వివరాలు పంపించగానే ఆ యువకుడి ఖాతాల నుంచి 70,000 మాయమైపోయాయి. షాక్ కి గురైన ఆ యువకుడు హుటాహుటిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజు ఇలాంటి కేసులు చాలానే నమోదవుతున్నాయని సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. 

 

 

 అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవచ్చు అని  ఏసీపీ  శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కస్టమర్ కేర్ నెంబర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గూగుల్ లో వివిధ కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్ లను శోధించ కూడదు అని తెలిపారు. ఖాతా నెంబరు యూపీఐ పిన్ ఓటిపి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్ కేర్ సర్వీస్ ప్రతినిధులకు చెప్పకూడదు అని సూచించారు. అసలైన కస్టమర్ కేర్ ప్రతినిధులు ఖాతా వివరాలను సేకరించరు అని తెలిపారు. ఒకవేళ మీ వ్యక్తిగత వివరాలు ఖాతా వివరాలు అడుగుతున్నారు అంటే అది మోసగాళ్ల పనే అని గుర్తించాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే ఆయా సంస్థల అసలు వెబ్సైట్ల, యాప్ ల  నుంచి ఫోన్ నెంబర్ స్వీకరించి ఫిర్యాదు చేయాలని సూచించారు సైబర్ క్రైమ్ ఏసిపి శ్రీనివాస్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: