ఏ పని చేయాలన్నా సరైన సమయస్ఫూర్తి ఎంతైనా అవసరం. సమయస్ఫూర్తి లేదు అంటే చేసే పనిలో విఫలం అవ్వాల్సిందే. అందుకే ఎప్పుడైనా సమయస్ఫూర్తి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇద్దరు అదే సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. తమ సమయస్ఫూర్తితో ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఇక్కడ ఓ వ్యక్తి ఓ మహిళ చూపిన సమయస్ఫూర్తిని... నీళ్ళల్లో పడి కొట్టుకుపోతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరి  ప్రాణాలను కాపాడింది. నీళ్ళల్లో కొట్టుకు పోతున్న వారిని చూసిన ఇద్దరు వ్యక్తులు... సరైన సమయంలో సమయస్ఫూర్తితో ఆలోచించి వారి ప్రాణాలను కాపాడారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సినదే మరి. 

 

 గుంటూరు జిల్లా ఈపూరు మండలం పరిధిలోని బొగ్గరం వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో ఈ ఘటన జరిగింది. శావల్యాపురం మండలానికి చెందిన అన్నదమ్ములు గుంటుపల్లి శివ శంకర్ శివ సాయి కిరణ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఇక అతివేగం కారణం వల్లనో లేదా ఇతర కారణం వలన ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కెనాల్ లో పడిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వారు నీటిలో కొట్టుకు పోతున్నారు. దీంతో సహాయం చేయాలి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. అయితే వారి అరుపులు విన్న పక్కనే ఉన్న పొలంలో పని చేసుకుంటున్న చేకూరి వెంకట నరసయ్య అనే రైతు తొలుత అక్కడికి వచ్చాడు. 

 

 

 అయితే వెంటనే తన లుంగీని నీటిలోకి పడేసి కాపాడాలని ప్రయత్నించాడు రైతు చేకూరి వెంకట నరసయ్య. అయితే ఆ రైతు లుంగీ మాత్రం కెనాల్లో కొట్టుకుపోతున్న వారి చేతులకు అందడం లేదు. ఈలోగా మిర్చి కోతల  నిమిత్తం  ఆటోలో వెళుతున్న ఓ మహిళ కూలి అక్కడికి వచ్చింది... తన ఒంటిపై ఉన్న చీరను తీసి ఇచ్చింది. దీంతో వారిద్దరికీ ఆ చీర అందగా ఆ చీరను పట్టుకుని కెనాల్ లో నీటి ప్రవాహం నుంచి బయటపడ్డారు. చీర సాయంతో వారిద్దరూ తమ ప్రాణాలను కాపాడుకోగా ... అనంతరం స్థానికులు నీటిలో పడిపోయినా ద్విచక్ర వాహనాన్ని కూడా వెలికితీశారు. ఇక నీటిలో కొట్టుకు పోతున్న ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడేందుకు సదరు రైతు,  మహిళకు చూపిన సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: