భారత్ చట్టాలను ఈ కామర్స్ సంస్థలు కచ్చితంగా పాటించాలంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖరాకండిగా తేల్చి చెప్పారు. చివరికి పెట్టుబడిదారులు భారత్‌లోని చట్టాలకు లోబడి వ్యవహరించాలన్నారు.  రేసీనా సమావేశంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామన్న అమెజాన్ ప్రకటనపై కూడా స్పందించారు. ‘భారత్‌లో ఓ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్న అమెజాన్ ఈ దేశానికి ఉపకారం చేసినట్లు అవ్వదు. ఇక్కడ ప్రతిఏటా బిలియన్ డాలర్ల నష్టం వస్తోందని వారు భావించినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి నిధులు తేక తప్పదు కదా’ అని ఆయన అన్నారు.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో ఈ విషయమై అమెజాన్ విచారణను ఎదుర్కుంటోంది. భారత్‌ కూడా అమెజాన్‌పై దృష్టి సారించింది.భారత పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ తమ వ్యాపారాల్ని నాశనం చేస్తోందంటూ చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.

ఇక భారత్‌లోని వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకోవాలని భావించిన బెజోస్‌కు ఇప్పటి వరకూ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు. ఇటీవల చిన్న వ్యాపారుల సంఘం ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ.. అమెజాన్‌పై చేసిన ఫిర్యాదుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) దృష్టి సారించింది. ఓవైపు భారీ డిస్కౌంట్లు ఇస్తూ మరోవైపు కొందరు అమ్మకందారులతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అమెజాన్‌పై ఎంక్వైరీ ప్రారంభించింది. భారత పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే అమెజాన్ తమ వ్యాపారాల్ని నాశనం చేస్తోందంటూ చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. 70 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ ఎంక్వైరీ చేపడుతున్న డైరెక్టర్ జనరల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గోయల్-జెఫ్‌ బెజోస్‌ల సమావేశం జరగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వస్తువులపై అమెజాన్ ఆఫర్ చేసే భారీ డిస్కౌంట్లపై ఇప్పటికే అనేక దేశాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: