ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా నాగబాబు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా నాగబాబు పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైసీపీ పార్టీ మరియు అంబటి రాంబాబు దుఃఖాన్ని చూడలేకపోతున్నా అని కామెంట్లు చేశారు. 
 
తనదైన శైలిలో పంచులతో నాగబాబు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లను విమర్శిస్తున్నారు. గతంలో కూడా పవన్ పై ఎవరైనా కామెంట్లు చేస్తే నాగబాబు కౌంటర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ జనసేన పార్టీ బీజేపీతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లోను, 2024 సార్వత్రిక ఎన్నికలలోను పని చేస్తుందని చెప్పటంతో పాటు వైసీపీపై తీవ్ర విమర్శలు చేయటంతో అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. 
 
అంబటి రాంబాబు నిన్న మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా స్థిరత్వం లేదని అన్నారు. పవన్ అకస్మాత్తుగా బీజేపీ పార్టీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పవన్ కళ్యాణ్ గతంలో పాచిపోయిన లడ్డూలు అంటూ బీజేపీ పార్టీపై విమర్శలు చేశారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు తాజా లడ్డూలను పంపించారా..? అంటూ ఎద్దేవా చేశారు. 
 
బీజేపీ పార్టీతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మిన పవన్ మమ్మల్ని విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్ నాలుగున్నర సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ఉండగలరా...? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్పార్టీ కార్యాలయంలో కూర్చుంటారో ఆ పార్టీకి మద్దతు ఇస్తారని వ్యాఖ్యలు చేశారు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మరి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: