ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి మార్పు రగడ  రగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం... రాజధాని అధ్యయనం కోసం నియమించిన రెండు కమిటీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు అన్నీ తీవ్ర స్థాయిలో అధికార పార్టీపై విరుచుకు పడుతున్నాయి. అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక 3 రాజధానిల అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నయి  విపక్ష పార్టీలు. 

 

 

 మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మార్చవద్దు అంటూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు అందరు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ  భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం అమరావతి నిర్మాణం చేపట్టేందుకు పంట పండించుకొనే  భూమి త్యాగం చేశామని ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని అంటే తమకు భవిష్యత్తు లేకుండా అవుతుంది అంటూ రాజధాని రైతులందరూ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. పలువురు రైతులు జగన్ ప్రకటనపై ఆవేదన చెంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. గత 31 రోజుల నుంచి అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రోజురోజుకు అమరావతి రైతుల నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 

 

 

 ఇక రైతుల నిరసనలతో రాజధాని అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. ఇకపోతే తాజాగా అమరావతి రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి భారీ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసును త్వరగా తేల్చేయాలి అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కు  అమరావతి రైతులు ఈమేల్స్  పంపించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అంటూ రాష్ట్రపతికి లేఖలు కూడా పంపించినట్లు పలువురు రైతులు చెబుతున్నారు. ఇకపోతే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే హై పవర్ కమిటీ తో నిర్వహించనున్న భేటీలో 3 రాజధానిల ప్రకటనపై కీలక నిర్ణయం వెలువడనుండి .

మరింత సమాచారం తెలుసుకోండి: