వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అక్రమాస్తుల కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు విచారణకు హాజరు అవుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాలేనని... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని... తాను విచారణకు హాజరు కావడం వల్ల ప్రజలకు సరైన సేవ చేయలేకపోతను అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 అక్రమాస్తుల కేసులో  సిబిఐ కోర్టుకు హాజరు విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే వీలుంది అంటూ సిబిఐ... కోర్టులో వాదనలు వినిపించడం తో జగన్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే గతవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఇకపోతే మరోసారి వ్యక్తిగత మినహాయింపుపై సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది. 

 

 

 కాగా ఈ పిటిషన్పై విచారించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు దీనిపై తీర్పును ఈ నెల 24న వెలువరించనుంది. ఇకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావు,  సబితా ఇంద్రారెడ్డికి సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ అక్రమ ఆస్తుల విషయంలో వీరిద్దరి చేయి కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ఆంధ్రప్రదేశ్ వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు,  తెలంగాణ టిఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. ఇద్దరు నేతలు అక్రమాస్తుల కేసులో హాజరుకానుండటం  ప్రస్తుతం ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: