జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. బీజేపీ తో కలిసే తన రాజకీయ పోరాటం ఉంటుందనే విషయాన్ని క్లారిటీ గా చెప్పేశాడు. ఇది రాజకీయంగా రెండు పార్టీలకు బాగా మేలు చేసే విషయమే. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పొత్తుపై ఇప్పుడు అనేక విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ కి ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఆవిర్భవించడంతో అందరూ ఈ పార్టీమీద ఆశలు పెట్టుకుని అందులో చేరిపోయారు. పవన్ చెప్పిన రాజకీయ సిద్ధాంతాలు నచ్చి ఎంతోమంది మేథావులు ఆ పార్టీలో చేరిపోయారు.


 కానీ ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ కొందరు పోలింగ్ ముందు మరికొందరు ఫలితాలు వచ్చాకా ఇంకొందరు పవన్ కళ్యాణ్ తీరును జనసేన పార్టీని విమర్శిస్తూ బయటకి వెళ్లిపోయారు. అదీ కాకుండా ఈ ఎన్నికల్లో అధినేతే పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందడంతో పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారింది. ఇక పార్టీని పవన్ ఏ విధంగా నడిపిస్తారు అనే సందేహం అందరిలోనూ తలెత్తడంతో ఇప్పుడు బిజెపి, జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇప్పటివరకు పవన్ తో ఉన్న మేథావులు, నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. 


బిజెపి లో నుంచి జనసేనకు వెళ్ళి తిరిగి వచ్చినవారు కొందరు, మరికొందరు కాంగ్రెస్ కి మనుగడ లేదని భావించి టిడిపి, వైసిపి, జనసేన లపై విముఖతతో కాషాయంలో చేరారు. వీరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనే నడవాల్సి వస్తుందని ఊహించలేకపోయారు. జనసేన తమతో కలవడం వల్ల 2024 లో తాము ఆశించిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీకి వస్తుందేమో అన్న ఆందోళన వారిలో అప్పుడే మొదలయ్యింది.


 వచ్చే ఎన్నికల నాటికి వైసిపి తగ్గుతుందని, క్షేత్ర స్థాయిలో బీజేపీ గట్టి పట్టు సాధిస్తుందనే భావనలో ఉంటూ వస్తున్నారు. ఇప్పటి నుంచే బూత్ స్థాయి కమిటీలతో కొందరు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే వీరికి స్థానిక జనసేన నాయకులు పోటీ కి వచ్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉండడంతో వీరిలో అప్పుడు భవిష్యత్తుపై బెంగ మొదలయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: