జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం గురించి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ మాట్లాడుతూ అధికారం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు 5 నుండి 6 శాతం ఓటింగ్ మాత్రమే వస్తుందని తాను ఎన్నికల ముందే చెప్పానని కేఏ పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటులో కూడా గెలవలేడని తాను ముందే చెప్పానని అన్నారు. 
 
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో జేడీ లక్ష్మీ నారాయణ టీంతో, కమ్యూనిస్టు పార్టీతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడని అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట కూడా ఓడిపోయాడని అన్నారు. సొంత సామాజిక వర్గం అయిన కాపులే పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేదని కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న ఓటర్లలో 25 శాతం కాపు ఓటర్లు ఉన్నారని కానీ వారు కూడా పవన్ కు ఓటు వేయలేదని అన్నారు. 
 
2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే పడ్డాయని కేఏపాల్ అన్నారు. చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 శాతం ఓట్లను సాధించారని కానీ పవన్ కళ్యాణ్ కు కేవలం ఆరు శాతం పడ్డాయని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు ఆరు శాతం ఓట్లు కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వచ్చాయని కేఏ పాల్ అన్నారు. పరోక్షంగా బీజేపీ పార్టీతో జనసేన పొత్తు గురించి కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. 
 
నిన్న బీజేపీ జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖారారైన విషయం తెలిసిందే. ఏపీకి బీజేపీ పార్టీతో అవసరం ఉందని అందువలనే బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పవన్ ప్రకటన చేశారు. ఇరు పార్టీలు ఇకనుండి ఏపీలో జగన్ ప్రభుత్వం చేసే తప్పిదాలపై ఉమ్మడిగా పోరాడతాయని చెప్పారు. స్థానిక ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలలో కూడా కలిసి పని చేస్తామని పవన్ ప్రకటించారు. పవన్ బీజేపీతో జనసేన పార్టీ పొత్తును ఖరారు చేయటంతో కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ను ఘాటుగా విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: