2012 డిసెంబర్ 17 వ తేదీన నిర్భయను అతి అతిదారుణంగా అత్యాచారం చేశారు.  ఆమె సున్నితమైన మర్మాంగాల్లోకి ఐరెన్ వస్తువులను ఉంచి గాయం చేశారు.  దీంతో తీవ్రమైన రక్తస్రావం కావడంతో పదిరోజులపాటు చావుబ్రతుకల మధ్య పోరాటం చేసి డిసెంబర్ 26 న మరణించింది.  నిర్భయ కేసులో దోషులను పోలీసులు పట్టుకున్నారు.  6 గురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ తరువాత అతడిని వదిలిపెట్టారు.  మరో వ్యక్తి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.  


కాగా, ఇప్పుడు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు.  నలుగురు నిందితుల ఉరికి సంబంధించిన డెత్ వారెంట్ కూడా కోర్టు రిలీజ్ చేసింది.  అయితే, నలుగురు నిందితుల్లో ముఖేష్ అనే వ్యక్తి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అప్లై చేసుకున్నారు.  ఈ పిటిషన్ పెండింగ్ లో ఉన్నది.  క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉంచడంతో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని వాయించేసింది.  అటు జైలు అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చింది.  


దీంతో హుటాహుటిన ఈ పిటీషన్ ను రాష్ట్రపతి వద్దకు పంపారు.  కాగా, ఈ పిటిషన్ పై నేడు ఈ పిటిషన్ పై రాష్ట్రపతి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.  రాష్ట్రపతి నిర్ణయంపైనే ముఖేష్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  రేప్ కేసులో క్షమాభిక్ష అవసరం లేదని ఇప్పటికే రాష్ట్రపతి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఒకవేళ ఈ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించి వెనక్కి పంపిస్తే... ఈ నిర్ణయం తీసుకున్న 14 రోజుల తరువాతగాని ఉరి అమలు చేయడానికి వీలులేదు.  


కానీ, కోర్టు మాత్రం ఈనెల 22 న ఉరి తీయాలని అంటోంది.  దీనికి సంబంధించిన చట్టాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.  అవకాశం ఉంటె ఈనెల 22 ఉదయం 7 గంటల ప్రాంతాల్లోనే ఆ నలుగురు నిందితులను ఉరి తీస్తారు.  ఏడేళ్లుగా నలుగురి ఉరి కోసం నిర్భయ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.  నలుగురు మృగాళ్లను ఉరి తీసిన రోజునే నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని అంటున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: