రసవత్తరంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా కేసియార్ కే పెద్ద షాకిచ్చారు.  మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్హాపూర్ మున్సిపాలిటిలో పోటి చేస్తున్న రెబల్ అభ్యర్ధుల తరపున మాజీ మంత్రి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలీక  అధికారపార్టీ అభ్యర్ధులు, ఎంఎల్ఏతో పాటు పార్టీ అగ్రనేతలందరూ తలలు పట్టుకున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కొల్హాపూర్ నియోజవర్గంలో మొదటి నుండి జూపల్లి కృష్ణారావుకు ఎంఎల్ఏ హర్హవర్ధన్ రెడ్డికి ఏమాత్రం పడదు. మొన్నటి ఎన్నికల్లో జూపల్లిపై   కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన హర్హవర్ధన్ రెడ్డి అనూహ్యంగా  టాఆర్ఎస్ లో చేరిపోయారు. దాంతో అప్పటి వరకూ జూపల్లికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ విషయం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది.

 

మున్సిపాలిటిలోని 20 వార్డుల్లోను ఎంఎల్ఏ వర్గీయులకే కేసియార్ టికెట్లు ఇచ్చారు. దాంతో అధికారికంగా బిఫారాలు అందించిన 20 మంది ఎంఎల్ఏ మద్దతుదారులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. తన వర్గంలోని వాళ్ళకు కూడా కొన్ని టికెట్లు తెచ్చుకోవాలని జూపల్లి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో కొందరు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుండి బిఫారాలు తెచ్చుకుని మొత్తం 20 వార్డుల్లోను నామినేషన్లు వేసేశారు.

 

అంటే ఫార్వార్డ్ బ్లాక్  పార్టీ తరపున బిఫారాలు తెచ్చుకున్న వాళ్ళంతా జూపల్లి మద్దతుదారులే లేండి. ఎప్పుడైతే వీళ్ళ బిఫారాలు కూడా ఆమోదం పొందాయో వెంటనే వీళ్ళందరూ ప్రచారాన్ని ప్రారంభించేశారు. అంటే టిఆర్ఎస్ పార్టీలోని నేతలే కొందరు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్ధులుగా పోటికి దిగటంతో కారు పార్టీ అధికారిక అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది.

 

రెబల్స్ తరపున ప్రచారం చేయద్దని కేసియార్, కేటియార్ తరపున వార్నింగులు వచ్చినా జూపల్లి పట్టించుకోకుండా వాళ్ళ గెలుపుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. జూపల్లితో మాట్లాడించేందుకు సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డిని పార్టీ పంపింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఇటువంటి పరిస్ధితే చాలా మున్సిపాలిటిల్లో ఉన్నట్లు సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: