ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గొడవలు మాములుగా జరుగుతున్నాయి. నెల రోజుల నుండి రచ్చ రచ్చ జరుగుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై రగిలిపోతున్నవారు రైతుల ఆందోళనలో వేలు పెట్టి గొడవను మరింత ఉదృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తో హైపవర్ కమిటీ ఈరోజు సాయింత్రం ఐదు గంటలకు భేటీ కానుంది. రైతుల సమస్యలు, రాజధాని అంశంపై చర్చించి ఓ నిర్ణాయానికి వచ్చే అవకాశముంది.         

 

కాగా రాజధానికి సంబంధించి హైపవర్‌ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రులు కోరిన విషయం తెలిసిందే. ఇక అమరావతి కోసం రైతుల ఫిర్యాదుల స్వీకరణకు శుక్రవారంతో అంటే నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 3,100మంది రైతులు ఫిర్యాదు చేశారు అని సమాచారం. శుక్రవారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సీఆర్డీఏ ఫిర్యాదులు స్వీకరించనుంది.           

 

అయిత్ హైపవర్‌ కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశం అయింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలను హైపవర్‌ కమిటీ పూర్తి అధ్యయనం చేసింది. కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యంలోని హైవర్‌ కమిటీ సీఎం జగన్ తో సమావేశం కానుంది. కాగా 3,100 మంది రైతులు ఇచ్చిన పిర్యాదుల గడువు ఈరోజు సాయింత్రం 5 గంటలకు ముగియనుంది. 

 

కాగా గత నెల రోజులలో అమరావతిలో రైతులు చేసిన నిరసనల సంగతి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అతని భార్య కూడా ఓ రేంజ్ లో నిరసనలు చేశారు. భార్య అయితే ఆమె రెండు గాజులను కూడా రాజధాని రైతుల కోసం దానం చేసేసింది. రాజధాని కోసం చంద్రబాబు జోలీ పట్టుకొని మరి నిరసన చేశారు. ఇలా చంద్రబాబు చేసిన రాజకీయానికి.. అమరావతి రైతుల నిరసన అంశంపై ఓ నిరణయానికి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: