నిర్భయ దోషులను ఉరి తీయటానికి లైన్ క్లియరైపోయినట్లే. న్యాయస్ధానాలు విదించిన ఉరిశిక్ష నుండి తప్పించుకోవటానికి నిందుతులు నలుగురిలో ఇద్దరు అన్నీ మార్గాలు వెతుక్కున్నారు. అయితే  ఏ మార్గాన్ని వెతికినా అన్నీ మూసుకుపోయాయి. తాజాగా వీరి క్షమాభిక్ష ను రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కూడా తిరస్కరించారు. దాంతో ఈనెల 22వ తేదీన అమలవ్వాల్సాని ఉరిశిక్ష మొదటి వారంలో అమలయ్యే అవకాశాలున్నాయి.

 

దాదాపు ఏడేళ్ళ క్రితం ఢిల్లీ వీధుల్లో తిరిగే ఓ బస్సులో నిర్భయ అనే యువతిని ఆరుమంది పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన దేశంలోనే  సంచలనం రేపింది. యువతిపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత యువతితో పాటు బాయ్ ఫ్రెండ్ ను చిత్రహింసలకు గురిచేసి ఇద్దరి బట్టలూడదీసేశారు. చివరకు చలికాలంలో బట్టలు లేకుండానే ఇద్దరిని రోడ్డుపై పడేసి బస్సులోన వెళ్ళిపోయారు.

 

ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ తో యువతి మరణించిందనుకోండి అది వేరే సంగతి.  తర్వాత మొదలైన దర్యాప్తులు ఈ ఆరుమందిని పట్టుకున్నా కేసు విచారణ మాత్రం నత్తనడకనే నడుస్తోంది. ఆరుగురు దోషుల్లో ఇద్దరు చనిపోయారు. మిగిలిన నలుగురి విషయంలో దర్యాప్తు స్పీడుగా జరగకపోగా వేసిన శిక్షల పైన కూడా కోర్టులో వాదనలు నెమ్మదిగా సాగింది.

 

అదే సమయంలో  తెలంగాణాలోని శంషాబాద్ ప్రాంతంలో జరిగిన దిశ హత్యాచారం వెలుగు చూడటంతో మళ్ళీ దేశవ్యాప్తంగా గొడవలు జరిగాయి. దాంతో నిర్భయ కేసు విచారణపై ప్రభావం పడింది. దిశ కేసులో వేడి వల్లే నిర్భయ విచారణ వేగంగా పూర్తి చేసుకుంది. దాంతో చివరకు నలుగురు దోషులకు ఢిల్లీ హై కోర్టు మరణశిక్ష విధించింది. ఇంతలోనే  దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవటం, సుప్రింకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశారు. అయితే క్యూరేటివ్ పిటీషన్ కొట్టేయటంతో పాటు రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించటంతో ఉరిశిక్ష అమలుకు లైన్ క్లియర్ అయ్యింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: