చైనాలో వేగంగా విస్తరిస్తున్న ఓ వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన వాళ్లలో వైరస్‌ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అన్ని దేశాలను అప్రమత్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

 

కొన్నేళ్ల క్రితం స్వైన్‌ ఫ్లూన్‌ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికించింది. తర్వాత జికా వైరస్‌ ఇబ్బంది పెట్టింది. తాజాగా కరోనా వైరస్‌ టెన్షన్‌ పెడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరాన్ని కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. కరోనా వైరస్‌ సోకిన వాళ్లు తీవ్రమైన నిమోనియాతో ఇబ్బందిపడుతున్నారు. ఇంత వరకూ 40 మంది నిమోనియా బారిన పడగా, వాళ్లలో ఒకరు చనిపోయారు. ఇటీవల ఈ నగరాన్ని సందర్శించిన జపాన్‌ యువకుడికి కూడా ఈ వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని జపాన్‌ అధికారులు ధ్రువీకరించారు. 

 

వారం క్రితం థాయ్‌లాండ్‌లో ఓ యువతి ఈ వైరస్‌ బారిన పడింది. సెలవుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఓ చైనా యువతి నిమోనియా భారినపడింది. ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్టు గుర్తించిన డాక్టర్లు... ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఇటీవల చైనాను సందర్శించిన 15 మంది హాంకాంగ్‌ యువకుల్ని కూడా పరీక్షిస్తున్నారు. వీరు కరోనా వైరెస్‌ భారిన పడ్డారో..? లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

 

ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తొలుత అనుమానించారు. కానీ... మనుషుల నుంచే మనషులకు వస్తుందని గుర్తించారు వైద్య నిపుణులు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు అధికారులు. కరోసా వైరస్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. మొత్తానికిి కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికించేస్తోంది. చైనా నుంచి వివిధ దేశాలకు వెళ్లే వాళ్లను ఆ దేశాల అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చికిత్స కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: