రాజధాని అమరావతి విషయంలోప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విధానంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే బోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను హైపవర్ కమిటీ పరిశీలిస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధం అవుతోంది. ముందుగా అధ్యయనం చేసిన వివిధ అంశాలపై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జగన్ కు వివరించారు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉండటంతో దీనిపై తుది నివేదికను రూపకల్పన చేయలేదని కమిటీ సభ్యులు తెలిపారు.

 

జీఎన్ రావు,బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నట్టుగా సచివాలయ తరలింపునకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. శనివారం మరోసారి హైపవర్ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రెండు కమిటీలు ఇచ్చిన నివేదికపై 15 రోజులుగా అధ్యయనం చేసి 29 గ్రామాల్లో సేకరించిన 33 వేల ఎకరాలు విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం ఎంత వరకు సద్వినియోగం చేసింది ? ఇంకా ఎంత ఖాళీగా ఉంచేసింది. అలాగే సీఆర్డీఏ రద్దు చేసే విషయం పైన, దాని స్థానంలో విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి అభివృద్ధి బోర్డులను పునరుద్ధరించాలని, దీని ద్వారా ఇచ్చిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో  అమలు చేయాలని హై పవర్ కమిటీ సూచించినట్లుగా తెలుస్తోంది. 


అలాగే రాజధాని నిర్మాణం కోసం వచ్చిన రైతులకు న్యాయం చేసే విషయంపై ఎక్కువ దృష్టి పెట్టాలని, దీని కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. హైపవర్ కమిటీ నివేదిక పూర్తి సారాంశం ఏమిటి అనేది జనవరి 20వ తేదీ ఉదయం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
అయితే జనవరి 20 వ తేదీన కమిటీ నివేదిక ఏంటి అనేది స్పష్టత రాబోతుండడంతో మరోసారి రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: