తాజాగా సీఎం వైయస్ జగన్ తాడేపల్లి లో సీఎం కార్యాలయం లో హైపవర్ కమిటీ సభ్యులతో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశాల వివరాలను సీఎంకు వివరించిన కమిటీ సభ్యులు తాజాగా వెలుగులోకి వచ్చిన మిగతా విషయాలను కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం.

 

అయితే ఈ సందర్భంగా కమిటీ విశేషాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయినా అలాగే విడిపోయి మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు వారి అభిప్రాయాల మేరకు తాజాగా హైపవర్ కమిటీ కొన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకురావడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

 

అంతేకాకుండా ఫైనల్ గా జరగబోయే క్యాబినెట్ మీటింగ్ కి హైపవర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరగబోతున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఒకరు అమరావతి రైతుల అంశం గురించి ఏ విధంగా భవిష్యత్తులో న్యాయం చేయబోతున్నారు అని ప్రశ్నించగా..మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తూ రైతుల మిషన్ కూడా హైపవర్ కమిటీ దృష్టికి వచ్చిందని దానికి సంబంధించి అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంత రైతులకు మరింత బెనిఫిట్స్ ఇచ్చే విధంగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రతి ఒక్క సమస్య అమరావతి ప్రాంతంలో ఉన్న రైతు సమస్య పరిష్కారం సామరస్య వాతావరణంలో జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించ బోతున్నట్లు గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా మరింత బెనిఫిట్స్ జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు ఇవ్వబోతున్నట్లు ఆ విధంగా ముందుకు అడుగు వెయ్య బోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: