ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని వికేంద్రీకరణ పేరిట అమరావతి ప్రాంతంలో రాజధాని కొనసాగిస్తూ విశాఖపట్టణం మరియు రాయలసీమ ప్రాంతంలో కూడా రాజధాని పెడితే చాలా బాగుంటుందని ఈ విధంగా జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని ఒక చోట మాత్రమే అభివృద్ధి జరగడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతానికి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయిందని అటువంటి పరిస్థితి రాబోయే భవిష్యత్ తరాల్లో ఉండకూడదని వైయస్ జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది.

 

దీంతో ఎప్పుడైతే జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు మొదలయ్యాయి. అమరావతి ప్రాంతంలో వైయస్ జగన్ రాజధానిని తరలిస్తున్నారని కామెంట్ చేస్తూ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు చేస్తూ చంద్రబాబు నాయుడు మరియు ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ ప్రాంతంలో రైతుల దగ్గర భూములు కొన్న టిడిపి బినామీలు.

 

ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని అమరావతి ప్రాంతాలలో దీక్షలు చేస్తూ తెగ గగ్గోలు పెడుతున్నారు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు మరియు అక్కడ ఆ ప్రాంతంలో భూములు కొన్న వాళ్ళు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సంక్రాంతి పండుగ వచ్చిన క్రమంలో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని తరలింపు చేస్తున్నారు అన్నదానిపై ప్రజలలో ఏమాత్రం వ్యతిరేకత రాకుండా చాలా మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఈ సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానులు నిర్ణయానికి సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటిన అంతగా ప్రజలు 3 రాజధానుల విషయంలో సంబరాలు చేసుకుంటున్నట్లు తేలిపోయింది. ఎక్కడా కూడా అమరావతి రాజధాని ప్రాంత నిరసన ఎఫెక్ట్ కనబడకపోవడం దీనికి నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: