అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది. అయితే ఇటీవ‌ల‌ ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఇక అప్ప‌టి నుంచి రాజ‌ధాని ర‌గ‌డ ప్రారంభ‌మైంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోందని కొంద‌రు నేత‌లు చెబుతున్నా అమ‌రావ‌తి రైతులు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ప్రాంతాల్లో నిర‌స‌న‌లు జ‌రుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ల‌కు కొంద‌రు న‌త‌లు మ‌ద్ద‌తు ప‌లుకుతంటే.. మ‌రికొంద‌రు అధికార పార్టీకి జై కొడుతున్నారు..

 

టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. కేవలం అసెంబ్లీ..సచివాలయం భవనాలతో..లేక పరిపాలనతో అభివృద్ధి జరగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ...పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని స్పష్టం చేసారు. మ‌రోవైపు చంద్ర‌బాబు హ‌యాంలో ఏ మాత్రం అమ‌రావ‌తి అభివృద్ధి జ‌రుగిందో తెలుస‌ని ఎద్దేవ చేస్తున్నారు. అవును! ఇక్క‌డ ప్ర‌త్యేకంగా వ‌చ్చిన సంస్థ‌లు కానీ, ప్ర‌త్యేకంగా నిర్మింత‌మైన ప్రాంతాలు కానీ ఏమీలేదు. కేవ‌లం అంతా గ్రాఫిక్ మ‌యం. 

 

బాబు ఊహా క‌ల్ప‌నే త‌ప్పా అక్క‌డేం లేద‌ని చెప్పాలి. డ్రీమ్ క్యాపిటల్ గా అమరావతి ఉండాలన్నదే తాను రూపొందించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. భావితరాలకు ఆశగా ఉండేలా రాజధానిని  నిర్మించినట్లు చెప్పొకొచ్చారు. కానీ.. రోజుకో డిజైన్‌, రోజుకో ప్ర‌క‌ట‌న‌, ఏదేశానికి వెళ్తే.. ఆ దేశ రాజ‌ధాని న‌మూనాతో అమ‌రావ‌తి నిర్మిస్తామ‌నే ప్ర‌సంగం.. ఇలా రోజుకోర‌కంగా మాట్లాడుతూనే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని విష‌యాన్ని స‌రిపెట్టార‌ని చెప్పాలి. ఇక ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అమ‌రావ‌తి కోసం అనేక ర‌కాలుగా నినాదాలు చేస్తూ.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఎలాగైనా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: