విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానంద సరస్వతి గురించి పెద్దగా ఎవరికీ చెప్పనవసరంలేదు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయ సలహాలు, సూచనలు, విమర్శలు చేయడమైనా స్వరూపానంద స్పందిస్తుంటారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కి కూడా స్వరూపానంద అంటే ఎంతో అభిమానం ఉండడం, తరచుగా ఆయన్ను కలుస్తుండడంతో ఈయన పేరు మారుమోగుతూ వస్తోంది. జగన్ ఎన్నికల ముందు నుంచి స్వరూపానంద సూచనల మేరకు ఆధ్యాత్మికంగా నడుస్తుండడంతో జగన్ రాజకీయ ప్రత్యర్థులు దీనిపైనా విమర్శలు మొదలుపెట్టారు. ఏపీ పునర్విభజన చట్టం కంటే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద శాసనమే ముఖ్యమంత్రి జగన్ కు ఎక్కువని టీడీపీ సీనియర్ నేత యనమల వంటి వారు విమర్శలు గుప్పించారు. 


ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ అనుకూల వర్గం వారు పెద్ద ఎత్తున దీనిపై పోస్టింగ్స్ పెడుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. స్వామి స్వరూపానంద, జగన్ పై సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కొన్ని కామెంట్స్ యథాతధంగా చూసుకుంటే సోషల్ మీడియాలో వీరిపై దాడి ఏ విధంగా సాగుతుందో అర్ధం అవుతుంది. 


2014 లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత క్రైస్తవ మిషనరీలకు వచ్చే నిధులపై ఆరా ఎక్కువయిందని, నోట్ల రద్దు తరువాత ఇది మరింతగా పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ తన అక్రమ సంపాదనను హవాలా రూపంలో తెచ్చుకునేందుకు ప్రధాన మార్గాలుగా ఈ క్రైస్తవ మిషనరీలు ఉన్నాయని, వీటి ద్వారానే అక్రమ మార్గంలో అక్రమ సంపాదనను తెచ్చుకునేందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు ఉపయోగపడుతున్నాయని, వీటిపై ఇప్పుడు నిఘా ఎక్కువ అవ్వడంతో వీరికి ఊపిరి ఆడడంలేదంటూ ప్రచారం మొదలయ్యింది.


అందుకే ఇంత అకస్మాత్తుగా జగన్ అకస్మాత్తుగా హిందూ మతంలోకి వెళ్లి స్వామి స్వరూపానంద దగ్గర తన బాధ చెప్పుకుని ఆయన్ను తన బినామీగా ఉండాల్సిందిగా ఆయన్ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఒక క్రైస్తవుడికి సహాయం చేయకూడదు కాబట్టే జగన్ ను నీళ్లలో ముంచి హిందూ మతంలోకి మర్చి జగన్ ను బీజేపీకి టార్గెట్ కాకుండా చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 


జగన్ అక్రమ సంపాదన మొత్తం హవాలా మార్గం ద్వారా స్వామి స్వరూపానంద కు చేరడంతోనే విశాఖ శారదా పీఠం లో ప్రతి ఆకు, చెట్టు జగన్ కోసం పనిచేసింది అని స్వరూపానంద బహిరంగంగా వ్యాఖ్యానించడంతో పాటు జగన్ కు స్వరూపానంద ముద్దు అందుకే పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం  హవాలా డబ్బు ఎన్నికల్లో ఖర్చు అయిపోవడంతోనే ఇప్పుడు స్వరూపానంద రుణం తీర్చుకునేందుకు బినామీ పేర్ల మీద 16,000 ఎకరాలు విశాఖలో కొన్నారని, ఇప్పుడు వాటికి రేట్లు పెంచేందుకే రాజధానిని ఇంత అకస్మాత్తుగా విశాఖకు తరలిస్తున్నారని ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: