ఈజీ మని కోసం ఈ మద్య మానాన్ని ఫణంగా పెడుతున్నారు కొంత మంది యువతులు.. ఇది క్యాష్ చేసుకొని కోట్లు గడిస్తున్నారు కొంత మంది దళారీలు.  ఐన వారి చేతుల్లో మోసపోయి కొందరు.. గ్రామాలు వదిలి పట్టణాల్లో బతకడానికి వచ్చిన యువతులను ట్రాప్ లో వేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు.  మరికొంత మంది లగ్జరీ కి అలవాటు పడి ఇలాంటి తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారు.  ఏన్ని సార్లు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నా.. హైటెక్ వ్యభిచారాలు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక ముంబాయిలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ దందా యథేచ్చగా సాగుతోంది. విటులను ఆకర్షించేందుకు అందమైన ముద్దుగుమ్మలను ఎరగా వేస్తున్నారు.

 

ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేర అంధేరీ తూర్పు పోలీసులు హోటల్ పై గురువారం దాడి చేశారు.  ప్రియా శర్మ కండీవలీ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా సమాచారం. దాంతో పాటు మరికొన్ని అసాంఘిక కార్యాకలాపాలు సాగిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె నిర్వహిస్తున్న ఈ సెక్స్ రాకెట్ లో గుట్టు తెలుసుకున్న పోలీసులు దాడిలో ముగ్గురు మహిళలు, ఓ మైనర్‌లతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా తెలిసింది.

 

దీనిని ప్రియా శర్మ అనే మహిళ నిర్వహిస్తున్నట్లుగా తెలిసి ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనలో దొరికిన వారిలో ఓ మహిళా యాక్టర్ కమ్ సింగర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ ఛానల్ లో  క్రైమ్ షోకు హోస్ట్ గా పనిచేస్తుంది. మరో మహిళ మరాఠీ మూవీలతో పాటు సీరియల్స్‌లో నటిస్తుంది. మైనర్ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.  మంచి ప్రొఫెషన్ లో ఉంటూ కేవలం లగ్జరీ కోసమే ఇలాంటి పనులకు పాల్పపడుతున్నట్లు సమాచారం.  తాజాగా ఈ వ్యవహారం ముంబయి సినీ వర్గాల్లో  సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: